Monday, May 6, 2024

తెర వెనుక రహస్యాలు బట్టబయలు..

తప్పక చదవండి
  • కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్‌ కోరారు
  • ఎన్డీఎలో చేరుతానని వచ్చినా ఒప్పుకోలేదు
  • అవినీతి కారణంగానే కేసీఆర్‌ను దూరం పెట్టా
  • ఓ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ
  • కేసీఆర్‌ను ఓడిరచేందుకు ముందుకు రావాలి
  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటే
  • నిజామాబాద్‌ వేదికగా ప్రధాని మోడీ విమర్శలు

‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్‌ దిల్లీ వచ్చి నన్ను కలిశారు. తాను కూడా ఎన్డీయేలో చేరతానని అడిగారు. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తానని.. ఆశీర్వదించాలని కోరారు. మీరేమైనా రాజులా.. ఇదేమైనా రాచరికమా.. యువరాజును సీఎం చేయడానికి అని అడిగాను. ఇక అదే ఆఖరి రోజు.. అప్పటి నుంచి వాళ్లు నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేదు. అప్పటి నుంచే కేసీఆర్‌ నన్ను కలవటం మానేశారు. ఇక.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరఫున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ వస్తే ప్రజలు నాకు అపూర్వ స్వాగతం పలికారు.’’ – ప్రధాని నరేంద్ర మోడీ

నిజామాబాద్‌ : ఎన్డీఏ చేరతానని సీఎం కేసీఆర్‌ వెంటపడ్డప్పటికీ ఆప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్‌ అవినీతి, కుటుంబ పాలన కారణంగానే ఆయనను దూరం పెట్టామని అన్నారు. మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన జనగర్జన సభలో మోడీ మాట్లాడుతూ.. కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వొద్దన్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులంతా దోపిడీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణను ఓ కుటుంబం దోచుకుంటోంది. ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణ సాకారమైంది. తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడిరది. కేసీఆర్‌ పాలనలో అవినీతి పెరిగింది. కేసీఆర్‌, ఆయన కుమారుడు… ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారు. కేంద్రం ఇచ్చిన నిధులనూ బీఆర్‌ఎస్‌ దోచుకుంటోందని దుయ్యబట్టారు. ఉద్యోగాల్లో అసలైన యువతకు అవకాశం రావడం లేదు. కేసీఆర్‌ గతంలో హైదరాబాద్‌ ఎన్నికలపుడు నాతో అప్యాయంగా ఉన్నాడు. ఆర్భాటంగా స్వాగతం పలికాడు.. ఇప్పుడేమైంది..మా అవసరం తీరాక ఆయన ప్రవర్తన మారిపోయింది. మా కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదు. కాంగ్రెస్‌ కూటమి రానీయక పోవడంతో మళ్లీ నా దగ్గరికి కేసీఆర్‌ వచ్చాడు. తన కొడుకును ఆశీర్వదించమని అడిగాడు. నేను నిరాకరించాను.. నాటి నుంచి నా కళ్లలోకి చూడ్డానికి కూడా సీఎం కేసీఆర్‌ భయపడుతున్నాడు.

- Advertisement -


వాళ్లిద్దరూ తెరచాటు ఒప్పందాలు చేసుకున్నారు..తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్‌ ఉంది. కరోనాకు మందు కనిపెట్టారు. నిజాం నవాబులు హైదరాబాద్‌ను వదలకపోతే ఒకే ఒక్క గుజరాతీ బిడ్డ వల్లబాభాయ్‌ పటేల్‌ వారిని తరిమేశారు. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన అవసరం లేదు. వేలాది మంది బలిదానం చేసి సాధించిన రాష్ట్రాన్ని ఒకే కుటుంబం కబ్జా చేసింది. ఇక్కడి ప్రజల కలలను తుంచేశారు. కాంగ్రెస్‌ వారితో కూడా అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదు. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌తో సంబంధం ఉంది. వాళ్లిద్దరు తెరచాటు ఒప్పందాలు చేసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఇలాగే చీకటి ఒప్పందాలు జరిగాయి. ఎన్టీపీసీ విద్యుత్‌ ఉత్పత్తిని తెలంగాణకే వినియోగిస్తున్నారు. రైల్వే, ఆరోగ్య పథకాలు తెలంగాణ ప్రజలకు అంకితం చేశాం. నిజామాబాద్‌ మహిళలు, రైతులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన అపురూప స్వాగతంతో ధన్యుడిని. ఈ ఎన్నికల్లో నారీ శక్తి చూపించాలి. మీ ఓట్ల బలంతో వాళ్లు బలవంతులు అయ్యారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. గతంలో లేని విధంగా నిజామాబాద్‌ సభలో ప్రధాని మోడీ పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారు. అందులో కేసీఆర్‌ ను టార్గెట్‌ గా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గ్రేటర్‌ ఎన్నికలు ముగిన తర్వాత రోజే కేసీఆర్‌ ఢల్లీి వెళ్లారు. ఎందుకు వెళ్లారో తెలియదు కానీ.. ఆ రోజున కేసఆర్‌ తనతో ఏం మాట్లాడారో మోడీ చెప్పారు. ఎన్డీఏలో చేరుతామని.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ పీఠం ఇస్తామని కేసీఆర్‌ ప్రతిపాదన పెట్టారని మోడీ చెప్పారు. అయితే ఎన్డీఏలో చేర్చుకునేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పామని మోడీ స్పష్టం చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌ మరోసారి ఢల్లీికి వచ్చి తన కుమారుడు కేటీఆర్‌కు బాధ్యతలు ఇస్తానని.. సహకరించాలని కోరారన్నారు. అయితే తాను మీరేమైనా రాజులా అని ప్రశ్నించాననని మోడీ తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పాన్ననారు. అప్పుడే కేసీఆర్‌ అవినీతి చిట్టా అంతా తాను చెప్పానన్నారు. అప్పట్నుంచి కేసీఆర్‌ తనను కలవడం మానేశారని చెప్పారు. గ్రేటర్‌ ఎన్నికలకు ముందు వరకూ తాను వస్తే.. స్వాగతం చెప్పేందుకు కేసీఆర్‌ వచ్చే వారని.. ఆ తర్వాత నుంచి మొహం చాటేస్తున్నారని మోడీ తెలిపారు. తన కళ్లలోకి చూడటానికి కేసీఆర్‌ భయపడుతున్నారని మోడీ వ్యాఖ్యానించారు. ఎంతో మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణను ఓ కుటంబం దోచుకుంటోందని మోడీ మండపడ్డారు. తెలంగాణ తరహాలో డబ్బులు వెదజల్లి గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్సే డబ్బులు పంపిందని స్పష్టం చేశారు. కేసీఆర్‌ పాలనలో అవినీతి పెరిగిందని కుటుంబసభ్యులందరూ దోపిడీ చేస్తున్నారని ప్రధాని మోడీ మండిపడ్డారు. తనపై నమ్మకం ఉంచి.. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వారని. కేసీఆర్‌ కుటుంబం దోచుకున్నదంతా కక్కిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ , ఆయన కమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే ధనవంతులయ్యారని మోడీ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అలయాల సొమ్మునూ దోచుకుంటుందోని విమర్శించారు.
ఇందురు గర్జన సభలో పసుపు బోర్డ్‌ ఉద్యమ నాయకుడు మనోహర్‌ రెడ్డి గురించి బండి సంజయ్‌ ను అడిగి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ… పసుపు బోర్డ్‌ కొసం 12 ఏళ్లపాటు చెప్పులు లేకుండా తిరిగిన కార్యకర్త పేరేమిటని ఆరా తీసిన ప్రధాని.. ఆ రైతు పేరు మనోహర్‌ రెడ్డి. పసుపు బోర్డ్‌ కొసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నాడు. పసుపు బోర్డ్‌ వచ్చేదాకా కాళ్ళ కు చెప్పులు వేసుకోబోనని శపథం చేసి 2011 నవంబర్‌ 4 నుండి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాడని చెప్పారు బండి సంజయ్‌. మనోహర్‌ రెడ్డి లక్ష్యం నెరవేరింది. నా తరపున ఆయనకు అభినందనలు చెప్పండి అని పేర్కొన్నారు మోదీ.
బండి సంజయ్‌ కు తరగని అభిమానం :
ఇందూరు గర్జన సభ ముగిసిన అనంతరం కరీం నగర్‌ వెళుతున్న బండి సంజయ్‌ కు దారి పొడవునా కార్యకర్తల నీరాజనం పలికారు.. .ఆయనను చుట్టుముట్టి హిందూ టైగర్‌ బండి సంజయ్‌, జై బీజేపీ అంటూ నినదించారు కార్యకర్తలు. బండి సంజయ్‌ తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు కార్యకర్తలు. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.. అనంతరం కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు బండి సంజయ్‌.
‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్‌ దిల్లీ వచ్చి నన్ను కలిశారు. తాను కూడా ఎన్డీయేలో చేరతానని అడిగారు. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తానని.. ఆశీర్వదించాలని కోరారు. మీరేమైనా రాజులా.. ఇదేమైనా రాచరికమా.. యువరాజును సీఎం చేయడానికి అని అడిగాను. ఇక అదే ఆఖరి రోజు.. అప్పటి నుంచి వాళ్లు నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేదు. అప్పటి నుంచే కేసీఆర్‌ నన్ను కలవటం మానేశారు. ఇక.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరఫున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ వస్తే ప్రజలు నాకు అపూర్వ స్వాగతం పలికారు.’’ – ప్రధాని నరేంద్ర మోడీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు