Friday, May 10, 2024

తిరుమలలో మరోసారి చిరుత కలకలం..

తప్పక చదవండి

తిరుమల : తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తున్నది. కడప జిల్లాలోని పులివెందులకు చెందిన కొంతమంది భక్తులు రోడ్డు దాటుతుండగా చిరుత పులి సంచారాన్ని గుర్తించారు. దీంతో విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కాలినడక భక్తులను అధికారులు గుంపులుగుంపులుగా అనుమతిస్తున్నారు. వాటర్‌ హౌస్‌ వద్ద సెక్యూరిటీ సిబ్బంది భక్తులను నిలిపి బ్యాచులుగా పంపుతున్నారు. కాగా, మరోసారి చిరుత సంచారంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. గత ఆగస్టులో నెల్లూరు జిల్లాకు చెందిన మూడేండ్ల చిన్నారి లక్షితపై చిరుత పులి దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో లక్షిత మృతి చెందింది. అంతకు ముందు మరో బాలుడిపై కూడా చిరుత దాడి చేసింది. అయితే ఆ సమయంలో ఆ బాలుడి కుటుంబ సభ్యులు పెద్దగా అరవడంతో బాలుడిని కొద్ది దూరం తీసుకెళ్లి చిరుత వదిలి వెళ్లింది. దీంతో చిరుత పులలను బంధించేందుకు అటవీ, టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. చిరుతల కదలికలున్న మార్గాల్లో సీసీటీవీ కెమెరాలు, బోన్లను ఏర్పాటు చేసి వాటిని బంధించిన సంగతి విధితమే. అయితే తాజాగా మరో చిరుతపులి కన్పించడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్ల మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు