Sunday, April 28, 2024

దిగుమతి ఎలక్ట్రిక్‌ కార్లపై సుంకం తగ్గింపు..

తప్పక చదవండి

ఎలన్‌మస్క్‌ సారధ్యంలోని ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ ‘టెస్లా’ కోసం కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందా..? విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్‌ కార్లపై దిగుమతి సుంకం తగ్గించాలని భావిస్తుందా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. దిగుమతి ఎలక్ట్రిక్‌ కార్లపై విధిస్తున్న సుంకం భారీగా తగ్గించాలన్న ఎలన్‌ మస్క్‌ డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చినందు వల్లే ఇప్పటి వరకు భారత్‌ మార్కెట్లోకి టెస్లా కార్లు ఎంటర్‌ కాలేదు. కానీ, ఎలన్‌ మస్క్‌ సారధ్యంలోని టెస్లా కార్ల కంపెనీని భారత్‌ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం దిగుమతి సుంకం 15 శాతం తగ్గించాలని కేంద్రం యోచిస్తు న్నట్లు వార్తలొస్తున్నాయి. భారత్‌లో ప్రొడక్షన్‌ యూనిట్‌ ఏర్పాటు కు గల అవకాశాలను పరిశీలిస్తున్న ఎలన్‌ మస్క్‌ టెస్లాను ప్రోత్స హించే దిశగా కేంద్రం.. దిగుమతి సుంకం తగ్గించాలని భావిస్తు న్నట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది. తదనుగుణంగా తొలుత అత్యంత చౌక ధరకు భారత్‌లో ఎలక్ట్రిక్‌ కారు తయారు చేయడానికి ప్రొడక్షన్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని తలపోసింది టెస్లా. కానీ ఇప్పుడు టెస్లా తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. జర్మనీ ప్రొడక్షన్‌ యూనిట్‌లో తయారు చేసిన కారును భారత్‌కు తీసుకురావాలని టెస్లా భావి స్తున్నది. ఈ కారు ధర 27 వేల డాలర్లు. ప్రస్తుతం టెస్లా మోడల్‌ 3 సెడాన్‌ కారు కంటే తక్కువ ధర. రూ.33.31 లక్షల్లోపు (40 వేల డాలర్ల లోపు) కంప్లీట్లీ బిల్ట్‌ యూనిట్‌ (సీబీయూ) కార్లపై 70 శాతం, 40 వేల డాలర్ల పై చిలుకు ధర గల కార్లపై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నది కేంద్రం. కానీ తమకు పరిమిత కాల రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని టెస్లా కోరింది. భారతదేశంలో కార్ల బిల్డింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే పరిమిత కాల రాయితీ ఇవ్వాలన్న షరతు కూడా పెట్టినట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదన వల్ల టెస్లాతోపాటు దేశంలో సీబీయూ రూట్‌లో ఎలక్ట్రిక్‌ కార్లు తయారు చేస్తున్న ఆటోమొబైల్‌ సంస్థలకు లబ్ధి చేకూరనున్నదని అధికార వర్గాల కథనం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు