Saturday, May 4, 2024

గాజాలో దాడులలో పసికందుల ప్రాణాలు..

తప్పక చదవండి

ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో గాజాలో అభం శుభం ఎరగని రోజుల పసికందులు ప్రాణాలు కోల్పోతున్నారు. నెలలు నిండక ముందే భూమ్మీద పడిన పాపాయిలను ఇంక్యుబేటర్లో ఉంచాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో ఇంక్యుబేటర్లు పనిచేయడంలేదని గాజాలోని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో పసికందులను వెచ్చదనం కోసం ఒకేచోట పక్కపక్కనే పడుకోబెడుతున్నట్లు వివరించారు. ఆదివారం తమ ఆసుపత్రిలో 39 మంది పసికందులు ఉండగా.. సాయంత్రానికి ముగ్గురు చనిపోయారని ఓ డాక్టర్ చెప్పారు. సోమవారం 36 మంది ఉన్నారని, వీరిలో రేపు ఎంతమంది మిగులుతారోనని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఆసుపత్రిలో బెడ్ చుట్టూ ఫాయిల్ చుట్టి అందులో పసికందులను పడుకోబెడుతున్నట్లు వైద్యులు చెప్పారు. ఆ బెడ్ పక్కనే వేడి నీళ్ల పాత్రలు పెట్టి వారికి వెచ్చదనం లభించేలా చూస్తున్నామని తెలిపారు. గాజాలోని అతిపెద్ద ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ఓవైపు మందులకు తీవ్ర కొరత ఏర్పడగా.. తాజాగా ఇంధనంలేక విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో ఆసుపత్రి మూతపడిందని ఆల్ షిఫా డైరెక్టర్ ప్రకటించారు. చాలా రోజుల క్రితమే కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఆదివారం వరకూ జనరేటర్లతో నెట్టుకొస్తున్నట్లు తెలిపారు. ఇంధనం కూడా నిండుకోవడంతో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిచిందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు