Monday, April 29, 2024

కోహ్లీని కెప్టెన్సీ నుంచి నేను తప్పించలేదు

తప్పక చదవండి

టీమిండియా రన్‌ మిషిన్‌ విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ ఎడిసోడ్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. కోహ్లిని తాను సారథ్య బాధ్యతల నుంచి తప్పించలేదని దాదా మరోసారి క్లారిటీ ఇచ్చారు. విరాట్‌ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానంటే, పరిమిత? ఓవర్ల ఫార్మాట్‌ నుంచి మొత్తం తప్పుకోవాలని మాత్రమే తాను సూచించాన్నాడు. అది కూడా కోహ్లి మంచి కోసమే అలా చెప్పానని ఆయన తెలిపాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ గంగూలీ సమాధానం చెప్పారు. అయితే, 2021లో అనూహ్య పరిణామాల మధ్య విరాట్‌ కోహ్లి భారత జట్టు కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్నాడు. తొలుత పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ ఆ తర్వాత కెప్టెన్సీ నుం?చి పూర్తిగా తప్పుకున్నాడు. తనకు చెప్పకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని అప్పట్లో కోహ్లి చేసిన కామెంట్స్‌ సంచలనం మారాయి. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంలో అప్పటి బీసీసీఐ చీఫ్‌ గంగూలీ కీలక పాత్ర పోషించాడని విరాట్‌ పరోక్షంగా విమర్శించారు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు తనకు ఫోన్‌ ద్వారా మాత్రమే చెప్పారని విరాట్‌ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా, ఆ తర్వాత కూడా ఈ విషయంపై కోహ్లీ- గంగూలీ మధ్య పరోక్ష యుద్దం కొనసాగింది. వీరిద్దరూ ఒకరికొరకు ఎదురుపడినప్పుడు కూడా మాట్లాడుకోలేదు.. ఐపీఎల్‌ 2023 సందర్భంగా వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి దిగిపోయాక రోహిత్‌ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అతని సారథ్యంలోనే భారత జట్టు ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిరది. అప్పటి వరకు అజేయ జట్టుగా ఉన్న టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై మూడోసారి వరల్డ్‌ కప్‌ గెలిచే సువర్ణావకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు