Monday, May 6, 2024

ఐపీఎల్‌లో రూ.10 కోట్లకు పైగా ధర పలికే స్టార్‌ ప్లేయర్స్‌..

తప్పక చదవండి

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-17 కోసం ఈ నెల 19వ తేదీన ఆక్షన్‌ జరగనుంది. అయితే, ఈ వేలంలో కొత్త రికార్డులు బద్దల య్యే ఛాన్స్‌ కనిపిస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ఆటగా ళ్లను విడుదల, రిటైన్‌ చేసుకున్న వారి జాబితాను పంపించాయి. రాబోయే 2024 సీజన్‌ లో ఇరు జట్లకు రూ.100 కోట్ల పారితో షికం అందనుంది. ఇక, రాబోయే వేలంలో రూ.10 కోట్లకు పైగా దక్కించుకునే ఐదుగురు విదేశీ స్టార్‌ ఆటగాళ్లు వీరే.. అయితే, ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్‌ లో ఆస్ట్రేలియా కప్‌ సాధించడంలో ట్రావిస్‌ హెడ్‌ కీలక పాత్ర పోషించాడు. అతడి ధనాధన్‌ ఇన్నింగ్స్‌ తో హెడ్‌ ను దక్కించుకునేందుకు పలు జట్లు పోటీ పడే అవకాశం ఉంది. ఈ సీజన్‌ ఐపీఎల్‌ వేలంలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ జట్లు ట్రావిస్‌ హెడ్‌ ను దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇక, ప్రపంచకప్‌ లో న్యూజిలాండ్‌ తరపున అత్యుత్తమ ప్రదర్శన చేసిన రచిన్‌ రవీంద్రను సైతం దక్కించుకునేందుకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీల దృష్టి పెట్టాయి. రచిన్‌ బాగా బౌలింగ్‌ కూడా చేస్తుండటంతో అతడి కోసం ప్రాంఛైజీలు పోటీ పడే ఛాన్స్‌ ఉంది. ఇక, మిచెల్‌ స్టార్క్‌ చాలా కాలం తర్వాత మళ్లీ ఐపీఎల్‌ లో వేలానికి వస్తు న్నాడు. స్టార్క్‌ చివరి సారిగా 2015లో ఆర్సీబీ తరఫున ఆడాడు. అదే ఫ్రాంచైజీ నుంచి స్టార్క్‌ కు ఎక్కువ బిడ్లు వచ్చే ఛాన్స్‌ ఉంది. బెంగళూరు ఫ్రాంఛైజీ ఈ అనుభవజ్ఞుడైన బౌలర్‌ కోసం పోటీ పడే ఛాన్స్‌ కూడా ఉంది. మరో వైపు జోఫ్రా ఆర్చర్‌ ను ముంబై ఇండియన్స్‌ వదులుకోవడంతో స్టార్క్‌ ను దక్కించుకోవడానిక ట్రై చేస్తుంది. అలాగే, వరల్డ్‌ కప్‌ లో సౌతాఫ్రికా తరపున అద్భుతంగా రాణించి 20 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించిన ఈ స్టార్‌ బౌలర్‌ డిసెంబర్‌ 19న దుబాయ్‌ లో జరిగే వేలంలో మోస్ట్‌ వాంటెడ్‌ పేసర్‌ గా బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. అలాగే, న్యూజిలాండ్‌ కు చెందిన మరో స్టార్‌ ప్లేయర్‌ డారిల్‌ మిచెల్‌ సాలిడ్‌ ను సైతం దక్కించుకోవడానికి పలు ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. అతని బ్యాటింగ్‌ పవర్‌ తో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ తో రెచ్చిపోతాడు. దీంతో పాటు మిచెల్‌ బౌలింగ్‌ కూడా చేస్తాడు.. ఫీల్డింగ్‌ కూడా అద్భుతంగా చేస్తుండటంతో అతడ్ని దక్కించుకునేందుకు పోటీ గట్టిగానే ఉంటుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు