Friday, May 3, 2024

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరామర్శించిన సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్

తప్పక చదవండి

హైద‌రాబాద్ : య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మరియు పోనీ వర్మ పరామ‌ర్శించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి.. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌కాశ్ రాజ్ ఆకాంక్షించారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మోత్కుపల్లి న‌ర్సింహులు, బీఆర్ఎస్ నాయ‌కుడు చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు కూడా కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు