Friday, May 17, 2024

హైదరాబాద్‌లో 3,000 చదరపు అడుగుల షోరూమ్‌ ప్రారంభించిన ఏషియన్‌ గ్రానిటో ఇండియా లిమిటెడ్‌

తప్పక చదవండి
  • ప్రీమియం జీవీటీ టైల్స్‌ గ్రాండ్‌ శ్లాబ్‌ కలెక్షన్‌ ప్రదర్శన

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : టైల్స్‌, మార్బుల్స్‌, క్వార్ట్జ్‌, బాత్‌ వేర్‌ సొల్యూషన్స్‌ వంటి లగ్జరీ ఉత్పత్తుల్లో అగ్రగామి బ్రాండ్‌ అయిన ఏషియన్‌ గ్రానిటో ఇండియా లిమిటెడ్‌ (ఏజీఎల్‌) హైదరాబాద్‌ క్రియాశీల మార్కెట్లో 3,000 చదరపు అడుగుల కంపెనీ డిస్‌ ప్లే షోరూంను ప్రారంభించింది. ఇందులో తమ కంపెనీ ఉత్పత్తులు, సాంకేతిక, సృజనాత్మక ప్రతిభను ఒకేచోట ప్రదర్శిస్తోంది. 700కు పైగా గ్లేజ్డ్‌ విట్రిఫైడ్‌ టైల్స్‌, గ్రాండ్‌ శ్లాబ్‌ లతో సహా ప్రీమియం టైల్స్‌, ఉపరిత లాల సేకరణ మొత్తం శ్రేణిని ఒకే చోట లభించేలా అన్ని పరిమాణాలు, డిజైన్లు, ఫినిషింగ్‌ లలో ఈ షోరూం ప్రదర్శిస్తుంది. భారతదేశంలోని ఐటీ, ఫార్మా కేంద్రమైన హైదరాబాద్‌ నగరంలో ఇది కంపెనీ యొక్క రెండో షోరూం అవుతుంది. ఇది కమలా పూరి కాలనీ మెయిన్‌ రోడ్‌, క్రిషే మెడోస్‌ ఎదురుగా గల కుర్వే ఎలైట్‌, ఫేజ్‌ -1 రెండో అంతస్తులో 202 నంబరులో ఉంది. ఈ షోరూం మొత్తం 3వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ టైల్స్‌, శ్లాబ్‌లలో అన్ని లేటెస్ట్‌ ట్రెండ్లను ఒకే చోట అనుభూతి చెందవచ్చు. ప్రతి క్లాసీ హోమ్‌ బిల్డర్‌, ఆర్కిటెక్టుల అన్ని అవసరాలను హైదరాబాద్‌ షోరూమ్‌ తీర్చగలదని భావిస్తున్నారు. స్టైల్‌ స్టేట్‌ మెంట్‌ జోడిరచడం, ఇండోర్‌-అవుట్‌ డోర్‌ స్పేస్‌, వాతావరణాన్ని సుసంపన్నం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది లగ్జరీ, శైలితో కూడిన ప్రత్యేక క్లాస్‌ను అందిస్తుంది. ఈ షోరూమ్‌ ను చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ కమలేష్‌ పటేల్‌, అసోసియేట్‌ డైరెక్టర్‌ శ్రీ షౌనక్‌ పటేల్‌ 2023 డిసెంబర్‌ 11న ఏషియన్‌ గ్రానిటో ఇండియా లిమిటెడ్‌ సీనియర్‌ నాయకుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏషియన్‌ గ్రానిటో ఇండియా లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ కమలేష్‌ పటేల్‌ మాట్లాడుతూ, ‘‘ఈ డిస్‌ ప్లే షోరూమ్‌ టైల్‌ షాపింగ్‌ అనుభవంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. డిజైన్‌ రిచ్‌ నెస్‌, విజువల్‌ ఇమ్మర్షన్‌లతో కూడిన కొత్త ప్రమాణాలను అందిస్తుంది. ఇది ప్రీమియం శ్రేణి టైల్స్‌, జీవీటీ కలెక్షన్‌, ఇంకా అన్ని పరిమాణాలు, డిజైన్లు, ఫినిషింగ్‌ లలో గ్రాండ్‌ శ్లాబ్‌ లను అభివృద్ధి చెందుతున్న కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా అందిస్తుంది. ఏషియన్‌ గ్రానిటో కొత్తగా ప్రవేశపెట్టిన జీవీటీ కలెక్షన్‌ అత్యాధునిక, స్టైలిష్‌ డిజైన్‌ ను కలిగి ఉంది. ఇది ఆర్కిటెక్టులు, ఇంటీరియర్‌ డిజైనర్ల ప్రాధాన్యతలను తీర్చే ఫ్యూచరిస్టిక్‌ సేకరణను అందిస్తుంది. విశ్వసనీయత, అడాప్టబిలిటీ, సృజనాత్మకత, నాణ్యత పట్ల నిబద్ధతకు విశ్వసనీయంగా, కంపెనీ బలమైన ప్రపంచస్థాయి బ్రాండ్‌ గుర్తింపును స్థాపించింది’’ అని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు