Monday, May 6, 2024

ఎనిమిది మంది భద్రతా సిబ్బందిపై వేటు

తప్పక చదవండి
  • లోక్ సభలో కలర్ గ్యాస్ ను విడుదల చేసిన దుండగులు
  • భద్రతా వైఫల్యంపై దేశ వ్యాప్తంగా కలకలం
  • భద్రతా వైఫల్యంపై పార్లమెంటులో గందరగోళం సృష్టించిన విపక్షాలు
  • లోక్ సభలో దాడికి తెగబడ్డ దుండగులు..

పార్లమెంటులో బుధవారం జరిగిన సెక్యూరిటీ వైఫల్యం ఘటనపై ఉభయ సభలు నేడు దద్దరిల్లిపోయాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భద్రతా లోపం తలెత్తిందని ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర ఆందోళనలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఇదే ఘటనకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కీలక భేటీ నిర్వహించారు. కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇక పార్లమెంటులో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై లోక్‌సభ సెక్రటేరియట్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఘటన జరిగిన సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న 8 మంది భద్రతా అధికారులను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు