Saturday, May 18, 2024

శబరిమలలో రద్దీ కొత్త కాదు

తప్పక చదవండి
  • అయ్యప్ప స్వామి భక్తులను ఇబ్బంది పెట్టడానికే ఈ కుట్ర
  • కేరళ హిందూ ఐక్యవేదిక, అధికార ప్రతినిధి ఆర్. వి. బాబు

స్వామియే శరణం అయ్యప్ప… ఓవైపు శరణు ఘోష మరోవైపు భక్తుల అరగోస. గతంలో ఎన్నడూలేని విధంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతంగా క్యూలైన్‌‌లో భక్తులు నిరీక్షిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో శబరిపీఠం నుంచి పంబ వరకూ క్యూలైన్‌‌ విస్తరించింది. రోజుకు 80 నుంచి లక్ష వరకూ వస్తుండటంతో… దర్శనానికి సమయం 18 నుంచి 24 గంటల పడుతోంది. కిలోమీటర్ల మేర భక్తులు బారులు దీరారు. క్యూలైన్‌లో నిరీక్షించలేక పలువురు యాత్రికులు దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగా, శబరిమలలో రద్దీ కొత్త కాదని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడం వల్లనే ఈ సమస్యలని కేరళ హిందూ ఐక్యవేదిక అధికార ప్రతినిధి ఆర్ వి బాబు అన్నారు. తమ సంస్థ అధ్యక్షురాలైన శశికళ టీచర్ నవంబర్ 2వ వారంలోనే స్వామి సన్నిధానం దర్శించి, మీడియా సమావేశం లో అక్కడ ఏర్పరచని కనీస అవసరాల గురించి ప్రస్తావించినా కూడా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) పట్టించుకోలేదని ఆయన అన్నారు.

- Advertisement -

పోలీసుల నియామకంలో పక్షపాత ధోరణి:

ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మరియు తన 20 మంత్రులతో కలిసి “నవ కేరళ సదస్సు” పేరున ప్రతి జిల్లా లో పర్యటిస్తున్నారు. వారి భద్రత కోసం 2200 మంది పోలీసు బలగాలను దింపుకున్నారు కానీ ప్రతిరోజు లక్షల్లో భక్తులు సందర్శించే శబరిమలై యాత్రకు సంబంధించి నీలక్కల్ మొదలుకొని పంబా మీదుగా స్వామి సన్నిధానం వరకు కేవలం 650 మంది పోలీసులను మాత్రమే నియమించారని కేరళ దినపత్రికలు చెబుతున్నాయి. దీనిని ఖండిస్తూ ముఖ్యమంత్రి స్పందించి 650 పోలీసులు కాదు, 16 వేల పోలీసు బలగాలను నియమించామని చెబుతున్నారు. కానీ మాకు మాత్రం ఈయన మాటల మీద నమ్మకం లేదు. ఒకవేళ నిజంగానే 16 వేల పోలీసు బలగాలను శబరిమల విధులకు నిర్వహిస్తే వారిని ఏ ప్రాంతంలో ఎంత మందిని నియమించారో చెప్పాలి. సన్నిధానంలో ఎంతమంది పోలీసులు, పంబ వద్ద ఎంతమంది, నిలకల్ లో ఎంతమంది బలగాలను మోహరించారో భక్తులకు వివరణ ఇవ్వాలి అని ఆర్ వి బాబు డిమాండ్ చేశారు.

టిడిబి మరియు పోలీసుల మధ్య సమన్వయ లోపం:

శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు ఆన్లైన్లో వర్చువల్ క్యూ టికెట్స్ తీసుకుంటారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఇదివరకటి వరకు కేరళ పోలీసుల వారు చూసుకునేవారు. వారి ఆధ్వర్యంలో నిర్వహించినంత కాలం ఓ మోస్తారు బాగానే నడిపించారు. కానీ ఈ విధి నిర్వహణను పోలీసుల నుండి తప్పించి టిడిబి తీసుకొని సొంతంగా నిర్వహిస్తున్నది. వీరు సమర్థవంతంగా నిర్వహించకపోవడం వల్లనే శబరిమలలో రద్దీకి సమస్య.

దేవస్థానం మినిస్టర్ రాధాకృష్ణన్ బాధ్యతారహిత వాక్యలు:

ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి, అయ్యప్ప స్వామి భక్తులకు సేవ చేసుకునే అదృష్టం పొంది, ఆ వరాన్ని దుర్వినియోగం చేసుకుంటున్న వ్యక్తి దేవస్థానం మినిస్టర్ రాధాకృష్ణన్. ఇతరత్రా ప్రాంతాల నుండి అయ్యప్ప స్వామి భక్తులు బృందాలు బృందాలుగా, గుంపులు గుంపులుగా ఎందుకొస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అతను వాక్యానించడం శ్రీ అయ్యప్ప స్వామిని అవమానపరచడమే. అసలు శబరి యాత్ర అంటేనే గురుస్వామి ఆధ్వర్యంలో స్వాములందరూ కలిసి బృందాలుగా వెళ్లడం. సరిగ్గా దానిపైనే హాస్యాస్పద వ్యాఖ్యలు చేయడం అతని అసమర్ధతకు నిదర్శనమని ఆర్వి బాబు అన్నారు.

పంప వద్ద ప్రైవేటు వాహనం పార్కింగ్ ఏమైంది?

కేరళలో వరదలు రాకముందు, పంబానది వరకు ప్రతి వాహనాలను అనుమతించేవారు. పంబ వద్దనున్న హిల్ టాప్ పైన దాదాపు 4 వేలకు పైగా ఫోర్ వీలర్స్ పార్క్ చేసుకునే సదావకాశం ఉన్నది. కానీ వరదల కారణంగా 2018లో కేరళ హైకోర్టు ప్రైవేటు వాహనాలను నిలకల్ వద్దనే ఆపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వరదల కారణంగా వచ్చినయి కాబట్టి ఇప్పుడు వరదలు ఏమి లేవు కనుక పంబ వరకు వాహనాలను అనుమతించే వెసులుబాటు కల్పించమని కేరళ హైకోర్టుని ఆశ్రయించాల్సిన బాధ్యత టిడిబి పై ఉన్నది. అలా కనక చేస్తే ట్రాఫిక్ ని అధిక శాతంలో మనము అదుపు చేయగలము. కానీ, ఏమీ పట్టనట్టు సోయి లేకుండా పడి ఉన్న ఈ దేవస్థానం బోర్డ్ అలాంటి ఎలాంటి ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం.

హిందూ సేవా సంస్థల బహిష్కరణ:

ఇదివరకు ఎన్నో హిందూ సమాజ సేవా సంస్థలు, సంఘాలు శబరిమల చుట్టుముట్టు ప్రాంతాలలో చేరుకొని స్వామివారి భక్తులకు సాధ్యమైనన్ని సేవలు చేసుకునేవారు. అలాంటి సంస్థలను ఇలాంటి సేవలనుండి దేవస్థానం బోర్డ్ బహిష్కరించింది. దీనితో వారి యొక్క అసూయ, ఈర్ష్య, ద్వేషం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనాప్పటికీ స్వామివారి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉన్నది. కానీ, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు దేవస్థానం బోర్డు తీసుకోలేదు. కావలసినన్ని స్వచ్ఛంద సంస్థలను నియమించలేదు. మరి అటు వాళ్లు చేయకపోవడం, ఇటు మమ్మల్ని చేయనీయకపోవడం ఎంతవరకు న్యాయమో భక్తులు ఒకసారి గమనించాలి.

దయచేసి వెనక్కి వెళ్ళకండి:

విపరీతమైన రద్దీ సృష్టించిన కారణంగా భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పరమ పవిత్రమైన ఇరుముడిలోని నెయ్యిని పందలం వద్దనే స్వామికి అర్పించి దర్శనం లేకుండానే భక్తులు తమ స్వస్థలాలకు తిరిగి వెళుతున్నారు. అయ్యప్ప స్వామి శబరిమల యాత్ర చరిత్రలో ఎన్నడూ ఇలాంటి హృదయ విధారకరమైన సంఘటనలు చోటు చేసుకోలేదు. భక్తులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. వారు తమ తమ రిటన్ రిజర్వేషన్ టికెట్స్ బుక్ చేయించుకోవడం, అంతలోపట స్వామివారి దర్శనం కాదననే చేదు విషయం తెలుసుకోవడం లంటి విషయాలు వారిని ఈ విధంగా చేపిస్తున్నాయి. భక్తులకు కేరళ హిందూ ఐక్యవేదిక విన్నవించడమేమనగా, దయచేసి కాస్త ఓపిక పట్టి సాధ్యమైనంత వరకు స్వామి దర్శనానికై వెళ్లండి. ఆ తరువాత మీ అందరి సమైక్య గలంతో అన్యాయాలను సృష్టిస్తున్న వారిపై ధ్వజమెత్తండి. ఒకరికి ఒకరం తోడుగా ఉందాం. మీయొక్క సమైక్యగలంతో ఈ అధికారుల వెన్నులో వణుకు పుట్టి మరొక్కసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉంటారు.

ఏటా కోట్ల భక్తులు – కోట్లలో కేరళ ప్రభుత్వానికి ఆదాయం

ఈ యొక్క శబరిమల యాత్రకి దేశం నలుమూలల నుండి ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తుల సందర్శన విపరీతంగా ఉంటుంది. నవంబర్ 16 మొదలుకొని 2 నెలల వరకు అఖండ భక్తజన సందోహంతో కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలో ఉన్న శబరిమల కళకళలాడుతుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక, మహోన్నత కార్యక్రమంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలు విపరీతంగా వృద్ధి నొందుతాయి. ఏడాది పొడవునా ఏ దిశగా రాని ఆదాయం ఈ మండలకాల మకర విలక్కు రెండు నెలల సమయంలో విపరీతమైన ఆదాయం వస్తుంది. అలాంటప్పుడు భక్తులకు కనీస అవసరాలు కూడా ప్రభుత్వం ఏర్పరచకుంటే ఎలా? ఆర్టీసీ డ్రైవర్లు చెప్పిన దాని ప్రకారం ఒక బస్సులో 49 మంది ప్రయాణికులు వెళ్లవచ్చు. కానీ దాదాపు 120 మంది ప్రయాణికులు ఒక బస్సులో ఎక్కుతున్నారట. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేరళ ప్రభుత్వం పంబ నుండి నిలక్కల్ వరకు కావలసిన కనీస కె ఎస్ ఆర్ టి సి బస్సులు సైతం నియమించలేదని.

రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి హామీ:

అటు ప్రభుత్వం కానీ, ఇటు పోలీసులు గాని, మరియు బాధ్యతాయుతమైన ట్రావన్కోర్ దేవస్థానం బోర్డ్ కానీ ఎలాంటి రక్షణ అయ్యప్ప స్వామి భక్తులకు కల్పించడం లేదు కాబట్టి, ఇక మేమే రంగంలోకి దిగాం. మేము మాత్రం స్వామి సన్నిధానం చేరుకుంటాం, శబరిమల చుట్టుముట్టు ప్రాంతాలు చేరుకుంటాం, అయ్యప్ప స్వామి భక్తులకు సాధ్యమైనంత సేవలు అందిస్తాం. ఇప్పటికే మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వల్సన్ తెలెంగేరి, జనరల్ సెక్రటరీ హరిదాస్ మరియు ఇతర రాష్ట్ర నాయకులు స్వామి సన్నిధానం చేరుకున్నారు. దేవస్వం మంత్రి మరియు ప్రెసిడెంట్ ని కలిసి సమస్యలను విన్నవించారు. మరో రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాబట్టి అయ్యప్ప భక్తులు ఎవరు కూడా దిగులు పడకండి. శబరిమలలో మీరు ఒంటరివాళ్లు కాదు. ఏ సమస్య ఉన్నా, నా నెంబర్
+91 9497722797 కి ఫోన్ చేయండి.

అడవుల్లో నీళ్లు లేక, తిండి లేక ఇబ్బంది పడ్డాం: ప్రత్యక్ష సాక్షి మావూరి దయానంద్ గురు స్వామి, హైదరాబాద్

మనందరికీ తెలిసిన విధంగా శబరిమలలో అత్యధిక రద్దీ ఉండేది మకర జ్యోతి రోజు మాత్రమే. అప్పటికంటే ఎక్కువ రద్దీ ఇప్పుడు ఉండదు. ఇప్పుడు మనము చూస్తున్న రద్దీ సాధారణ రద్దీ మాత్రమే. కానీ పోలీసు వారు కావాలని భక్తులను ఆపుతున్నారు. మేము దర్శనం చేసుకుని తిరిగి వచ్చే సమయంలో కొండపై జన సందోహం లేదు. ఇది నా ప్రత్యక్ష అనుభవం. కానీ భక్తులను మాత్రం కట్టలు కట్టలుగా ఆపేశారు. ఇలా కావాలని ఆపి రద్దీని సృష్టించి మనల్నందరినీ భయభ్రాంతులకు గురి చేసే కుట్ర జరుగుతున్నది. దయచేసి మన అయ్యప్ప స్వామి భక్తులందరికీ ప్రార్థించేదేమనగా వీరి కుట్రలకు మనము భగ్నం కావద్దు. మనమందరం ముఖ్యంగా స్వామి భక్తులు అత్యధికంగా వెళ్లే దక్షిణ భారత దేశంలోని భక్తులందరూ కలిసికట్టుగా ఉండి మూకుమ్మడిగా వీరి రాక్షస ప్రయత్నాలను తిప్పికొడదాం. అడవుల్లో తిండి లేక, నీరు లేక, కనీస అవసరాలు అందక, చిన్న పెద్ద ముసలి ముతక అందరం బాధపడ్డాం. ఈ వర్ణన చాలదా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడానికి? హిందూ రాష్ట్ర ఏర్పాటుకై పని చేస్తున్నామని చెబుతున్న బిజెపి కేంద్ర పెద్దలు తలుచుకుంటే ఈ సమస్యకు క్షణంలో విముక్తి లభిస్తుంది. శబరిమల పుణ్యక్షేత్రం కేవలం రాష్ట్ర ప్రభుత్వానిదే కాదు, ఈ యొక్క క్షేత్ర సాయిని చూసి దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధీనం లోకి కూడా ఎప్పుడో వేశారు. మరి కేరళ రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఇన్ని ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? కనీసం ఒక పది లక్షల మంది జనాలు మరణిస్తే కానీ కేంద్ర ప్రభుత్వం చలించదా? అటు కేంద్రానికి ఇటు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు మనమందరం మూకుమ్మడి గా ఏకం అవ్వాలి. లేదంటే వీలు సృష్టిస్తున్న భయభ్రాంతులకు ఇక ముందు ఏ తల్లిదండ్రులు కూడా తమ చంటి పాపలకు, చిన్న పిల్లలకు అయ్యప్ప స్వామి మాల వేయించే ధైర్య సాహసం చేయరు. దయచేసి ఆలోచించండి.

  • ప్రభుత్వం, పోలీసులు, టిడిబి విఫలం అయిన కారణంగా శబరిమలలో తిష్ట వేసిన కేరళ హిందూ ఐక్యవేదిక సంస్థ
  • మరో రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన దేవస్థానం మంత్రి మరియు అధ్యక్షుడు
  • భక్తులూ భయపడకండి.. మీ సేవకై కేరళ హిందూ ఐక్యవేదిక ఉన్నది
  • మీకు ఏ సహాయం కావాలన్నా నా నంబర్ +91 94977 22797 కి ఫోన్ చేయండి
  • ముఖ్యమంత్రి పినరాయి విజయన్, 20 మంత్రుల “నవ కేరళ సదస్సు” కు 2200 మంది పోలీసులు
  • కానీ శబరిమల విధులకు కేవలం 650 పోలీసులు మాత్రమేనా అని ప్రచురించిన కేరళ దిన పత్రికలు?
  • శబరిమల కు 16 వేల మంది పోలీసు బలగాలను మోహరించామని చెబుతున్న ముఖ్యమంత్రి మాటలను మేము నమ్మడం లేదు
  • మీ లెక్కలు నిజమైతే నిరూపించండి.
  • ఇతర రాష్ట్రాల నుండి భక్తులు బృందాలుగా రావడం వల్లనే ఈ సమస్య అని దేవస్వం మినిస్టర్ రాధాకృష్ణన్ అనడం ఎంతవరకు సమంజసం?
  • హిందూ సేవా సంస్థలను శబరిమల సేవల నుండి బహిష్కరించిన టిడిబీ – మీరు చేయరు మమ్మల్ని చేయనీయరా?
  • ప్రైవేటు వాహనాలను పంబ వద్ద పార్క్ చేయించే కోర్టు ఆర్డర్ టీడీబీ ఎందుకు తీసుకు రావడం లేదు?
  • అనుభవమే లేని ప్రశాంత్ అనే కాంగ్రెస్ పూర్వ నాయకుడికి టిడిబి పగ్గాలు అప్పజెప్పడం సమ్మతమేనా?
  • భక్తులు భయపడకండి – వెనక్కి వెళ్లకండి – మరో 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని దేవస్థానం బోర్డ్ మంత్రి మరియు అధ్యక్షులు హామీ ఇచ్చారు.
  • ఏటా కోటికి పైగా భక్తులు దర్శించుకునే శబరిమల – కోట్లలో కేరళ ప్రభుత్వానికి ఆదాయం – అయినా భక్తులపై చిన్న చూపు
  • కేంద్రం చొరవ చూపని కారణంగా, వీళ్ళ ఎజెండాకు శాశ్వత ముగింపు పలికే బాధ్యత దక్షిణ భారతదేశ అయ్యప్ప భక్తులందరూ తీసుకోవాలి: మావూరి దయానంద్, గురుస్వామి
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు