Tuesday, May 14, 2024

కష్టాలు తీర్చిన నాయకుడిని మర్చిపోవద్దు : హరీశ్‌రావు

తప్పక చదవండి

సిద్దిపేట : మర్కుక్‌ దశ, దిశ మార్చింది కేసీఆర్‌ నీళ్ల కష్టాలు తీర్చాడు. రోడ్లు లేక నాడు ఎంతో ఇబ్బందులు. నేడు డబుల్‌ రోడ్లు కనిపిస్తున్నాయి. గతుకుల గజ్వేల్‌(ఉజీతీలివశ్రీ)ను బతుకుల గజ్వేల్‌ చేసిండని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు గజ్వేల్‌ నియోజకవర్గం, మర్కుక్‌లో కేసీఆర్‌ గెలుపును కాంక్షిస్తూ మంత్రి హరీశ్‌ రావు రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెత్తివిూద గంగమ్మ లెక్క కొండపోచమ్మ సాగర్‌ తెచ్చింది కేసీఆర్‌. ఎన్నికల సమయంలో ఎవడో వచ్చి బిడ్డా బిడ్డా అంటే నమ్మి మోసపోవద్దు. ఇంకొకడు వస్తే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఉండదు, అభివృద్ధి ఉండదని స్పష్టం చేశారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద సర్కారు దవాఖాన అంటున్నారు. ఈసారి బీఆర్‌ఎస్‌ గెలవగానే సన్నబియ్యం, పాత బియ్యం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అసైన్డ్‌ ల్యాండ్స్‌కి పట్టా ఇచ్చి హక్కులు ఇవ్వబోతున్నం. సిలిండర్‌ ధరలు పెంచిన బిజెపి వాళ్లని ప్రశ్నించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. బూతులు మాట్లాడే వారికి పోలింగ్‌ బుతుల్లోనే బుద్ధి చెప్పాలని సూచించారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ను మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ వస్తే మూడు గంటల కరెంట్‌ వస్తది. 10 ఊఖ మోటార్‌ ఎవరు కొనివ్వాలి. రేవంత్‌ రెడ్డికి వ్యవసాయం అంటే తెల్వదని విమర్శించారు. 30 తేదీన అందరం కారుకు గుద్దాలి. బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. మంత్రి హరీశ్‌ రావు సమక్షంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు