హైదరాబాద్ : బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు తోడు దొంగలని.. ఎంఐఎం కబంధ హస్తాల్లో ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. శుక్రవారం విూట్ ది ప్రెస్‌లో ఎంపీ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికల తర్వాత కలుస్తాయన్నారు. బీజేపీ బీసీని సీఎం చేస్తామంటే.. బీసీలను అవమానించే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ బాధ్యత తాను తీసుకుంటానని ప్రధాని హావిూ ఇచ్చారని గుర్తుచేశారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని .. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ల అభివృద్ధి చేసి చూపుతామని హావిూ ఇచ్చారు. కులం కాదు గుణం ముఖ్యమని కేటీఆర్ కూడా బీసీలను అవమానించే విధంగా మాట్లాడారన్నారు. బీసీ జనగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని.. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని… టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయని తెలిపారు. రెడ్డి, చౌదరీలు కర్ణాటకలో బీసీలు… వైశ్యులు, బ్రాహ్మణులు కొన్ని రాష్ట్రాల్లో బీసీలు… వాళ్ళను బీసీలో చేర్చాలా? అని ప్రశ్నించారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి ఉమ్మడి పౌర చట్టాన్ని తీసుకొచ్చేందుకు వర్క్ అవుట్ చేస్తామని ఎంపీ తెలిపారు.