Friday, May 3, 2024

ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య

తప్పక చదవండి

నర్సంపేట : అసెంబ్లీకి ఎన్నికల నిర్వహణలో భాగంగా నియోజక వర్గ ఆర్వో కె.కృష్ణ వేణి అధ్వర్యంలో పోలింగ్‌ పి.ఓలు, ఏపి.ఓలకు పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహణ ఫెసిలిటేటర్‌ సెంటర్‌ ను బిట్స్‌ కాలేజీ లో ఏర్పాటు చేసిన సెంటర్‌ ను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ పి.ప్రావీణ్య సందర్శించి,పోలింగ్‌ అధికారులను ద్దేశించి మాట్లాడుతూ… ఎన్నికలలో ప్రిసై డిరగ్‌, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారుల విధులు కీలకమని, ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎన్నికలు పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుటకు అధికారులు తమ వంతు కృషి చేయాలని అన్నారు. సోమవారం రోజున ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణలో 342కి గాను 336 మంది హాజరు అయ్యారని నియోజక ఆర్వో కృష్ణవేణి అన్నారు.ఈ శిక్షణలో పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాట్లు,మరియు ఇవియం ల పై అవగాహన కల్పించడం జరిగిందని వారు అన్నారు. ఈ శిక్షణ అనంతరం పి.ఓ.లకు ఏ .పి.ఓ లకు పరీక్షలు నిర్వహించి, వారి సందేహాలను నివృత్తి చేయడం చేయడం జరిగిందని అన్నారు.ఈ అవగాహన కార్యక్రమం రేపు కూడా కొనసాగుతాయాని వారు అన్నారు.అనంతరం వ్యవసాయ మార్కెట్‌ గోదాం లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు స్ట్రాంగ్‌ రూం ఏర్పాట్లు పకడ్బందీ ఉండాలని పోలీసు అధికారులను, సంబంధిత ఎన్నికల అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఆర్వో విశ్వప్రసాద్‌, పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు