Saturday, December 2, 2023

దుర్మార్గపు పాలనను సాగనంపుదాం..

తప్పక చదవండి
  • కొత్తగూడెంను సన్‌స్ట్రోక్‌ నుండి కాపాడుకుందాం : కూనంనేని

చుంచుపల్లి : ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఇదేనాకు ఆఖరి అవకాశం మరోసారి ఎన్నికల్లో నిలబడనూ అంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మించి ప్రాణా లతో చెలగాటం ఆడుతున్న దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఆసన్నమైందని కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి సిపిఐరాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.కాంగ్రెస్‌, సిపిఎం,టీజెఎస్‌, సిపిఐఎంఎల్‌ప్రజాపంధా పార్టీలు బలపర్చిన కూనంనేని సోమవారం చుంచుపల్లి మండల పరిధిలోని సుభాష్‌చంద్రబోస్‌నగర్‌, మేషన్‌నగర్‌కాలనీ, టూఇన్‌క్లైన్‌, 4ఇంక్లైన్‌, నాగయ్యగడ్డ, చిట్టిరామవరం, రామవంతోపాటు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయ నకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న కొత్తగూడెం నియోజకవర్గాన్ని గత కొంతకాలంగా అశాంతి రాజ్యమేలుతోందన్నారు. దోపిడీదారులు, దొంగలు, ద్రోహులు, హంతకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భయబ్రాతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈరాబంధులను తుడిచిపెట్టే గాలివాన మిత్రపక్షాలు బలపర్చిన సిపిఐ రూపంలో వస్తుందని వారు కనుచూపు మేరకు కూడా కనిపించకుండా కొట్టుకుపోవడం ఖాయమన్నారు. వనమా కుటుంబం ప్రజలను పీడిస్తూనే ఉందని, ఎందరో అమాయకులు బలైపోయారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఒంటెద్దు పోకడలతో పాలన సాగిస్తున్నారన్నారు. నియోజకవర్గప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారన్నారు ఆరు గ్యారంటీలు నూటికి నూరుపాళ్లు అమలు చేసి తీరుతామన్నారు. మిత్రపక్షాలు బలపర్చిన సిపిఐ అభ్యర్థి ఎన్నికల గుర్తు కంకికొడవలికిఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలోనాగ సీతారాములు, కంచర్ల జమలయ్య, పద్మ, శ్రీను, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు