- గజ్వేల్ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్
- ఓటు అంటే మురిపం కాదు ఐదేళ్ల భవిత భవిష్యత్తు
- భారీ మెజార్టీతో గెలిపించండి
- గజ్వేల్ రోడ్ షోలో మంత్రి హరీష్ రావు
గజ్వేల్ : ప్రభుత్వంలోకి రాని బిజెపికి ఓటు వేస్తే ఆగం అవుతాం అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. సోమవారం సీఎం కేసీఆర్‌కి మద్దతుగా, గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అందరూ వస్తుంటారు పోతుంటారు అని, లేని పోనివి చెబుతుంటారు అని, ప్రజలు ఆలో చన చేయాలి వారన్నారు, పదేళ్ల కేసీఆర్ హయాంలో గజ్వేల్ ఎంత అభివృద్ది చెందింది చుక్క నీళ్ళ లేని గజ్వేల్ ను, నీళ్ళ గజ్వేల్ లాగా చేసింది కేసీఆర్ అని తెలిపారు, నాడు కైకిలు దొరకలేదు, నేడు కైకిలోల్లు దొరకడం లేదు అని వారన్నారు. గజ్వేల్ ఆసుపత్రి ఎంత అభివృద్ధి రూపాయి ఖర్చు లేకుండా డెలివరీ చేసి, కేసీఆర్ కిట్ ఇచ్చి పంపిస్తున్నది కేసీఆర్ కాదా అని వారన్నారు, నాడు కాన్పు పోతే 40, 50 వేల ఖర్చు అయ్యేది. నేడు అలాంటి పరిస్తితి ఉందా ఉందా అని వారన్నారు. ఎందరు ఎమ్మెల్యేలు మారినా నీళ్ల కష్టాలు తొలగలేదు. కెసిఆర్ వచ్చిన తర్వాత ఖాళీ బిందల ప్రదర్శన లేదు, నీళ్ళ కోసం లొల్లి లేదు అని తెలిపారు, గజ్వేల్ రింగ్ రోడ్డు, రేడి యల్ రోడ్డు తీసుకువచ్చింది కేసీఆర్ నేడు బంగారు బాటల గజ్వేల్ చేసింది కేసీఆర్ ఎవరన్నా తప్పి పోయి ఇక్కడ ఎమ్మెల్యే అయితే కేసీఆర్ వేసిన రోడ్లకు రిపేర్ అయితే డంబర్ కూడా పోయారు అని విమర్శించారు,గజ్వేల్ అభివృద్ధి కొనసాగాలంటే కారుకు ఓటు వేయాలి మంత్రి హరీష్ రావు అన్నారు, పాండవుల చెరువు ఎంతో అభివృద్ధి అయ్యింది. 10 కోట్లతో రామాలయం, శివాలయం కట్టారు. 5 కోట్లతో పత్తి మార్కెట్ కట్టారు రైలును గజ్వేల్ కు తెచ్చింది కేసీఆర్ కెసిఆర్ అని వారన్నారు, ఈటెల రాజేందర్ ఇక్కడి ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నాడా?కరోనా సమయంలో అందరూ భయపడితే ఇక్కడ నేను మొదటి కరోనా పేషెంట్ ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పాను. మన బి ఆర్ ఎస్ నాయకులు వచ్చి ధైర్యం చెప్పామని మంత్రి హరీష్ రావు అన్నారు.అప్పుడు ఈటెల రాజేందర్ వచ్చాడా? ఎవడో వచ్చి మాట్లాడితే ప్రజలు ఆలోచించాలి. కళ్యాణ లక్ష్మి, పింఛన్లు ఇచ్చింది కేసీఆర్ కాంగ్రెస్ పుర్రె గుర్తు పెడితే, బిజెపి జిఎస్టి వేసింది. కేసీఆర్ మాత్రం బీడీ కార్మికులకు పింఛన్లు మంజూరు చేశారని వారన్నారు, బిజెపి వాళ్లు గజ్వేల్ కు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు విమర్శించారు, బిజెపి వాళ్ళు.400 సిలిండర్ వెయ్యి చేసింది పువ్వు గుర్తొడు పాల మీద జీఎస్టీ వేసింది పువ్వు గుర్తోడు బాయుకాడ, బోరుకాడ మీటర్ పెట్టాలంటున్నది పువ్వు గుర్తోడుఅని, మీ ఇంటికి కాడికి బిల్లు పంపు అంటున్నది పువ్వు గుర్తోడు ఏం ముఖం పెట్టుకొని బిజెపి వాళ్ళు ఓట్లు వేయాలని ఊర్లలో తిరుగుతున్నరు విమర్శించారు. కరోనా వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీకు అండగా ఉన్నవాడు నీ దోస్త్.ఇప్పుడు వచ్చి సుట్టరికం కలిపే వాళ్లకు ఓటుతో బుద్ది చెప్పాలి.కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు వస్తాయి అని చీకటి కష్టాలు మొదలు అవుతాయి విమర్శించారు. భూములు లక్కొంటారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారుఅని విమర్శించారు.కేసీఆర్ అసైన్డ్ భూము లకు హక్కులు ఇస్తా అని చెప్పారు అని, రైతుల భూముల విలువ పెంచింది సీఎం కేసీఆర్, వంద అబద్ధాలు ఆడి గెలవాలని కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నారు అని, నమ్మితే మోసపోతాము అని, ఆర్ అండ్ ఆర్ కాలని అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం అని మంత్రి హరీష్ రావు అన్నారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, ఎఫ్బీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజ మౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పిటిసి సం ఘం మల్లేశం, మండల ప్రెసిడెంట్ మధు, నాచారం దేవాలయ మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి,టౌన్ అధ్యక్షులు నవాజ్ మీరా, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి, ఎంపీటీసీల పోరం అశోక్ కుమార్, బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.