Tuesday, April 30, 2024

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్, బిజెపి నాయకులు

తప్పక చదవండి

మేడ్చల్ : సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీ ల నుండి వలసలు భారీగా పెరుగుతున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డుకు చెందిన పలువురు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక కౌన్సిలర్ తుడుం గణేష్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిజెపి నాయకులు నాగరాజు, భాస్కర్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వారి అనుచరులకు మంత్రి మల్లారెడ్డి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీలకు వలసలు బాగా పెరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందాయని, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని మూడోసారి కెసిఆర్ సీఎం కావడం పక్కా అని జోష్యం చెప్పారు. పార్టీలో చేరిన యువకులు నాయకులు రాబోయే ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి ఏ ఎమ్మెల్యే చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ కౌన్సిలర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ నరసింహారెడ్డి, నాయకులు సత్యనారాయణ రెడ్డి, ఇంద్రరెడ్డి, మధుసూదన్ రెడ్డి, 4వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షుడు వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ నరేష్, కుమార్, వినయ్, పవన్, సాయి, భుజంగరావు, అశోక్, సాయి గౌడ్, ప్రశాంత్, అరవింద్, మారుతి, బిఆర్ఎస్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శ్యామ్, కాళీ, శివాజీ, బాలు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు