Friday, May 3, 2024

సిఎంఅర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

తప్పక చదవండి

మేడ్చల్ : తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందని సిఎంఅర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ గోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ మండలంలోని, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కండ్ల కొయ్య సిఎంఅర్ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు తెలంగాణ సాంస్కృతిని గుర్తు తెచ్చేలా సంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను కళాశాల ఆవరణలో ఉంచి, లయబద్దంగా చప్పట్లు కొడుతూ, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడి పాడారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి వేడుకలు నిర్వహించడం ద్వారా భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను అలవాటు చేసిన వాళ్ళం అవుతామన్నారు. ఒకప్పటి పండుగలు రోజురోజుకు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా, భావితరాలకు మన సంప్రదాయాలు, పండుగల గొప్పతనాన్ని వారికి అందించిన వాళ్ళం అవుతామని సంగీత రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం రెడ్డి, రోహిణి రెడ్డి, వెంకటేశ్వర్లు, ఫ్యాకల్టీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు