Monday, May 13, 2024

తెల్ల రేషన్‌ కార్డుల గుట్టు తేలేనా?

తప్పక చదవండి

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ పాలనలో పౌరసరఫరాల విభాగాన్ని అల్లకల్లోలం చేశారని, ఆ శాఖ వద్ద 90లక్షల టన్నుల ధాన్యానికి లెక్కల్లేవని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నిజానికి ఇదంతా ఎక్కడికి పోయిందన్న చర్చ సాగుతోంది. దీనిని మిల్లర్లు అమ్ముకున్నారా అన్న నిజం తేలాల్సి ఉంది. ఈ ధాన్యం ఉందా.. లేదా.. మిల్లర్లు అమ్ముకున్నరా.. ఉంటే ఎక్కడుంది అనే గందరగోళం నెలకొంది. దీనిపై సమగ్ర పరిశీలన ప్రారంభించామని మంత్రి ప్రకటించారు. పదేండ్లలో ఈ శాఖ రూ. 56 వేల కోట్ల అప్పుల్లో ఉందని బాధ్యత చేపట్టిన మంత్రి ఉత్తమ్‌ తొలిరోజే ప్రకటించారు. ప్రస్తుతం రేషన్‌ కార్డుపై ఒక్కో వ్యక్తికి 6కిలోల బియ్యం ఇస్తుండగా.. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 5 కిలోలని, మిగతా కిలోబియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇకపోతే రేషన్‌ బియ్యం చాలాచోట్ల లబ్ధిదారులకు చేరడం లేదన్నది వాస్తవం. అంతేగాకుండా ఆరోగ్యశ్రీలాంటి పథకాల కోసం చాలామంది గ్రామస్థాయిలో తెల్ల రేషన్‌ కార్డులు పొందారు కొత్తకార్డులు ఇచ్చే ముందు ఇలాంటి దొంగకార్డుల సంగతిని నిగ్గు తేల్చాల్సి ఉంది. బియ్యం ఎటు దారి మళ్లుతున్నాయో కూడా తేల్చాలి. ఇదంతా ఓ పెద్ద మాఫియాలాగా సాగుతోంది. దీనిని ఛేదించాలి. అప్పుడే ప్రజలకు న్యాయం జరగగలదు. ఆర్థికంగా ఆదా కాగలదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు