Wednesday, May 8, 2024

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

తప్పక చదవండి
  • తెలంగాణలో చలిగాలుల తీవ్రత
  • ఉత్తర తెలంగాణలో పెరుగుతన్న చలి

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. కనిష్ట స్థాయిలి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఇలాంటి వాతావరణమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. తెలంగాణలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. చలిగాలులు తీవ్రత పెరిగింది. ఆకాశం మేఘావృతమై మెల్లగా పొగమంచు ఆవరించింది. ఉత్తర తెలంగాణలో చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. తూర్పు, ఆగ్నేయం వైపు నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాత్రివేళల్లోనే కాకుండా పగటి ఉష్ణోగ్రతలూ పడిపోతున్నాయని, రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నదని హెచ్చరించింది.గిరిజన ప్రాంతాలు చలికి అల్లాడిపోతున్నాయి. ఆదిలాబాద్‌, వరంగల్‌ కరీంనగర్‌ జిల్లాలను మంచు మేఘాలు కమ్మేస్తున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు అయింది. అక్కడ 11 డిగ్రీల సెల్సియస్‌ నమోదు అయింది. ఆదివారం మాత్రం ఆదిలాబాద్‌ జిల్లా అతి తక్కువ ఉష్ణోగ్రత 13.1 డిగ్రీలు నమోదు అయింది. గరిష్ణ ఉష్ణోగ్రత ఖమ్మం జిల్లాలో 30 డిగ్రీలుగా రిజిస్టర్‌ అయింది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే… మూడు నాలుగు ప్రాంతాల్లో 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు రిజిస్టర్‌ అయ్యాయి. గరిష్ణ ఉష్ణోగ్రత కూడా ఒక్క ఖమ్మం మినహా అన్ని ప్రాంతాల్లో 25 నుంచి 28 మధ్యే ఉంది. రాష్ట్రంలో చాలా చోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వెల్లడిరచింది. పలు చోట్ల అత్యల్పంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 13.1 డిగ్రీలు, మెదక్‌లో 14.3, రంగారెడ్డిలో 15.7, హైదరాబాద్‌లో 16.2, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో 17 చొప్పున, నల్లగొండలో 17.4, నిజామాబాద్‌ 18.1, మహబూబ్‌నగర్‌ 20.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో 50 శాతం తేమ నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్టు పేర్కొన్నది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిరదని, సముద్రం నుంచి తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడిరచింది. గాలుల ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు అమరావతి వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, మరో 24 గంటల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు