Friday, May 17, 2024

సిఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే నవ్వుస్తోంది

తప్పక చదవండి
  • డబ్బు, అహంకారం, అధికార మదం బిఆర్‌ఎస్‌కు ఉంది : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఖమ్మం జిల్లా : కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో`కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఖమ్మం, సంజీవరెడ్డి భవన్‌లో విూడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని, సీఎం నిన్నటి సభలో ఆయన పక్కన కూర్చుంది ఎవరు? ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేదన్నారు. ‘‘డబ్బు అహంకారంతో అధికార మదంతో విర్రవీగే కేసీఆర్‌ విూరా ప్రజా స్వామ్యం గురించి మాట్లాడేది.. కేసీఆర్‌కు ఛాలెంజ్‌ చేస్తున్న.. తడిబట్టలతో ఏ గుడికి వస్తారో రండి.. నాకు ఏ పైరవీలు చేశారు… ఏ కాంట్రాక్టులు ఇచ్చారో చెప్పండి.. నేను కూడా తడి బట్టలతో అదే గుడికి వస్తా’’నని పొంగులేటి సవాల్‌ చేశారు. పాలేరులో దళిత బంధు గురించి మాట్లాడుతున్నారని, హుజూరాబాద్‌లో గెలవటం కోసం ప్రకటించారని, అక్కడ ఏం జరిగిందో ప్రజలు చూశారన్నారు. ఓట్లు వేయకపోతే రెస్టు తీసుకుంటామని సీఎం అంటున్నారని.. ఇప్పడు మటుకు చేసేది ఏముంది? కేవలం సోల్లు కబుర్లు చెబుతూ జనాన్ని మోసం చేయటమే కదా అని సెటైర్లు వేశారు. అక్రమంగా సంపాదించిన డబ్బు నోట్ల కట్టలతో వస్తున్నానని సీఎం కేసీఆర్‌ అంటున్నారని, తాను కష్టపడి సంపాదించిన డబ్బు అని అధికారికంగా చెప్పగలనని పొంగులేటి అన్నారు. మరి ముఖ్యమంత్రి ఏ వ్యాపారం చేశారని, లక్షల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం తెలంగాణను దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు. ఇంత నీచమైన రాజకీయ నాయకుడిని ఎక్కడ చూడలేదన్నారు. మేడిగడ్డ పరిస్దితి ఏమైందని ప్రశ్నించారు. మేడిగడ్డ కేసీఆర్‌ ఏటిఎంగా మారిందని ప్రధాని మోదీతో సహా అందరూ చెప్పారన్నారు. సీఎం కేసీఆర్‌ పతనానికి మేడిగడ్డ చివరి మెట్టని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు