Tuesday, May 7, 2024

మళ్లీ వస్తున్నా.. మీకోసం..

తప్పక చదవండి
  • కరీంనగర్ లో పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్
  • ఈనెల 7న కరీంనగర్ టౌన్ నుండి మొదలు
  • రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్ సుడిగాలి పర్యటనలు
  • ఒకవైపు పాదయాత్ర… మరోవైపు ఎన్నికల ప్రచారం
  • 8న సిరిసిల్ల నుండి పర్యటనలకు శ్రీకారం
  • బుల్లెట్ ప్రూఫ్ కారు భద్రత నడుమ ప్రచారం
  • బీఆర్ఎస్ ను గెలిపించేందుకు మజ్లిస్ తంటాలు
  • 6న నామినేషన్ వేయనున్న బండి సంజయ్ కుమార్

కరీంనగర్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 7నుండి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేయబోతున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం వరకు, ఆ తరువాత సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. తొలిరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అంబేద్కర్ నగర్ లోని 24వ డివిజన్ లో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఒకవైపు తన నియోజకవర్గంలో పాదయాత్ర చేయడంతోపాటు మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి రావాలంటూ పార్టీ నాయకత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తుండటంతో బండి సంజయ్ కు ప్రత్యేకంగా హెలికాప్టర్ కేటాయించింది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయాలని కోరింది. మిగిలిన సమయాన్ని తాను పోటీ చేస్తున్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించాని సూచించింది. అందులో భాగంగా 8, 9, 10వ తేదీల్లో ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనే అంశంపై షెడ్యూల్ ను రూపొందించింది. తొలిరోజు సిరిసిల్ల, నారాయణపేట, మరుసటి రోజు ఖానాపూర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. దీంతోపాటు బండి సంజయ్ భద్రతను ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారుకు అనుమతిచ్చింది. మరోవైపు బండి సంజయ్ కుమార్ ఈనెల 6న బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్నారు. ఆరోజు మంచి ముహూర్తం ఉండటంతో వేద పండితుల సూచనల మేరకు ఆరోజు నామినేషన్ వేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు కరీంనగర్ లోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం నుండి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిరికిపందలని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీజేపీని నేరుగా ఢీకొనలేక ఆ ఇద్దరు నేతలు పరస్పర ఒప్పందంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయన్నారు. తెలంగాణ అంతటా ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించి సత్తా చాటుతామని ప్రగల్భాలు పలికిన ఒవైసీ మాట తప్పి పిరికిపందలా పారిపోయారనక్నారు. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసేందుకు యూ టర్న్ తీసుకుని పాతబస్తీలోని 9 స్థానాలకే పరిమితమైన పిరికిపంద ఒవైసీ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓట్లు, సీట్ల కోసం వావివరసలను మార్చేసి కేసీఆర్ ను మామ అంటూ సంబోధిస్తున్నారని విమర్శించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు