Sunday, May 19, 2024

బీఅర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డిని ఓడించాలి

తప్పక చదవండి
  • ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్ రాథోడ్

మేడ్చల్ : మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఏర్పాటు చేయకుండా విద్యార్థులను మోసం చేసిన మంత్రి మల్లారెడ్డి చిత్తుగా ఓడించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్ రాథోడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సంతోష్ రాథోడ్ శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఓటు హక్కు ఉన్న ప్రతి విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గత 2007 నుండి పోరాటం చేస్తుంటే గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మేం ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నా సొంత బిల్డింగ్ లో నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే బాధ్యత నాదని మాయ మాటలు చెప్పి విద్యార్థులను నుండి గతంలో ఓట్లు వేపించుకున్నారు. గత హామీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఇప్పటివరకు నెరవేర్చలేదు. కాబట్టి ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డిని ఓడించండి.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మేడ్చల్ కి రాలేదు కానీ మల్లారెడ్డి కి మాత్రం యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, విద్యాసంస్థలకు మాత్రం పర్మిషన్లు వచ్చినాయని, విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలి అని పోరాటం చేస్తున్న రాలేదని వాపోయారు. మల్లారెడ్డికి మాత్రం విద్యాసంస్థలు పెరుగుతున్నాయి అని మండిపడ్డారు. మేడ్చల్ కి వచ్చిన ప్రతి మంత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన డిగ్రీ కళాశాల మాత్రం రాకపోవడం సిగ్గుచేటు అని ఎద్దేవ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతల్లో లేదని, విద్యావ్యవస్థ వ్యతిరేక ప్రభుత్వంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకై ఓట్లు వేద్దాం. డిగ్రీ కళాశాల సాధనకై పోరాటం చేద్దాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహయ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు శ్యామ్ రావ్, ఎస్ఎఫ్ఐ నాయకులు నిఖిల్, రాకేష్, కార్తీక్, అనిల్, మనీష్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు