Wednesday, September 11, 2024
spot_img

అవిశ్వాసమా..? రాజీనామానా..?

తప్పక చదవండి
  • కోదాడ ఎంపీపీ ఆగడాలు చెక్‌ పెట్టేందుకు తెరపైకి అవిశ్వాసం.?
  • ప్రస్తుతం కాంగ్రెస్‌ తరపున నలుగురు ఎంపీటీసీలు.
  • మరో ఇద్దరు ఎంపీటీసీలు కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం.?
  • ఎంపీటీసీలు చేరగానే అవిశ్వాసం పెట్టే అవకాశం.!

కోదాడ (ఆదాబ్‌ హైదారాబాద్‌) : కోదాడ ఎంపీపీ పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమైంది.గత ఐదు ఏండ్లుగా కేవలం కోదాడ మండలానికే పరిమితం కాకుండా ఏకంగా కోదాడ నియోజకవర్గం మొత్తాన్ని ఏకచత్రాధిపత్యంపై ఏలిన ఎంపీపీ ప్రస్తుతం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ ప్రముఖులు చర్చించుకుంటున్నారు.గత నాలుగున్నర సంవత్సరాలుగా తన తోటి ఎంపీటీసీలను పట్టించుకోకుండా, సొంత నిర్ణయాలతో సదరు ఎంపిటిసి లను ఇబ్బందులకు గురి చేయడంతో, వారందరూ ఈమెపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. కోదాడ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ ప్రజాప్రతి నిధులకు కొండంత బలం చేకూరినట్లు అయింది.ఇన్ని రోజులు తాము అధికారంలోకి లేకపోవడంతో,ఏం చేయలేని పరిస్థితి కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులకు నెలకొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో మరియు కోదాడలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంది. గత కొన్ని రోజులుగా ఎంపీటీసీలు కొందరు కోదాడ ఎంపీపీ పై అసహనంగా ఉన్నారు.సమయం కోసం వేచి చూస్తున్నా వాళ్ళకి సరైన అవకాశం దొరికినట్లు అయింది.దీంతో ఎంపీపై అవి శ్వాసం పెట్టేందుకు ఎంపీటీసీలు ఏకమవుతున్నట్లు సమాచారం. కోదాడ ఎంపిటిసిలు 11 మంది ఉండగా అందులో ఇద్దరు మర ణించారు. ప్రస్తుతం ఉన్న 9 మందిలో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో ఇద్దరు టిఆర్‌ ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌ లోకి చేరారు.దీంతో కాంగ్రెస్‌ పార్టీ తరపున నలుగురు ఎంపీటీసీలు అయ్యారు.ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ పార్టీ తరఫున 5గురు ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. వీరిలో మరో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని సమా చారం. ఇద్దరు పార్టీలో చేరిన అనంతరం అవిశ్వాసానికి పెట్టే అవకాశం ఉందని ఎంపిటిసి ఒకరు తెలిపారు. త్వరలోనే అవి శ్వాసం పెడతామని, అభివృద్ధిలో అట్టడుగు ఉన్న కోదాడ మండ లాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో అభివృద్ధి చేస్తామని సదరు ఎంపీటీసీ తెలిపారు.ఇదిలా ఉండగా కోదాడ ఎంపీపీ తనకు తానే రాజీనామా చేయాలని నిర్ణయించు కున్నట్లు కానీ మాజీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి సలహా మేరకు ఆనిర్ణయాన్ని విరమించుకున్నట్లు పట్టణ వాసులు చెప్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు