Friday, May 17, 2024

మిర్యాలగూడలో చర్చనీయాంశం

తప్పక చదవండి
  • ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఖాళీ…
  • దుమ్ము, దూళి, తప్ప ఫర్నిచర్‌, సోఫాలు మాయం..!

మిర్యాలగూడ (ఆదాబ్‌హైదరాబాద్‌): మిర్యాలగూడ ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయం అంతా ఖాళీ చెత్తా చెదారం తప్ప, మొత్తం ఖాళీగా ఉం దని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం ఎన్నికల అనంతరం బిఆర్‌ఎస్‌ ఎమ్మేల్యే అభ్యర్ధి నల్లమోతు భాస్కర్‌ రావు ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్‌ ఆర్‌) చేతిలో ఓటమి చవి చూసిన అనంతరం ప్రభుత్వ ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయాన్ని ఈ నెల 7న ఖాళీ చేశారని తెలిసింది. క్యాంపు కార్యాలయంలో కొన్ని ట్యూబ్‌ లైట్లు, బల్బులు తప్ప మొత్తం ఫర్నీచర్‌, సోఫా, మంచాలు కంచాలు, ఏసీలు తీసు కెళ్లారు. వారు వెళ్లిన తర్వాత క్యాంపు కార్యాలయ భవనం నిర్వహణ బాధ్యులమని రిపేర్‌ చేద్దామని వచ్చిన ఆర్‌ అండ్‌ బి. ఏ ఈ. రాంబాబు రెండు ఎసిలు లేక పోవడంతో వెంటనే అప్పటి ఎమ్మేల్యే అనుచరులకు ఫోన్‌ చేయడంతో ఆ రెండు ఏసిలు క్యాంపు కార్యా లయానికి తీసుకువచ్చారు. కార్యాలయ మరమ్మతులు, కలరింగ్‌ చేసేందుకు ఆర్‌ అండ్‌ బి ఎఇతో వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు నూకల వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ సాధారణంగా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎమ్మేల్యే క్యాంపు కార్యా లయంలో నిర్మాణంతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. కంప్యూటర్లు, వాటిని ఆపరేట్‌ చేసే వారికి కుర్చీలు, టేబుల్‌, ఎమ్మేల్యే కూర్చునేందుకు కుర్చీ, టేబుల్‌, ఆయన ముందు కూర్చునే వారికి కుర్చీలు, సమావేశ మందిరంలో డయాస్‌ కు సదస్సులు కూర్చోడానికి కుర్చీలు, సందర్శకులు వేచి చూసేం దుకు ఫర్నీచర్‌, కార్యాలయమంటే హైదరాబాద్‌ ఎమ్మేల్యే క్వార్టర్స్‌లో ఉండే సౌకర్యాలు కల్పించాలన్నారు. మరీ అప్పటి ప్రభుత్వం కల్పించ లేదా ఒక్క సామాను లేకపోవడానికి కారణాలు ఏమిటని పలువురు ప్రశ్నంచారు. కార్యాలయంలో వంట సామాగ్రి, మంచాలు, అన్ని లేకుండా పోయాయని. ప్రభుత్వ విద్యా, పశుసంవ్ధక శాఖలలోనే ఫైల్స్‌ చోరీకి గురైందని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యా లయం ఇదెంతా అని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంతట మొత్తం ఫర్నిచర్‌ లేకుండా ఖాళీగా ఉందన్న విషయం మిర్యాలగూడ పట్టణంలో చర్చనీయాంశముగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు