- అధికారులపై ఒత్తిడి తెస్తున్న ప్రజా ప్రతినిధులు..!
- ఖజానాకు భారీ గండి..
అబ్దుల్లాపూర్మెట్ (ఆదాబ్ హైదరాబాద్): జాతీయ రహదారి 65 ను ఆనుకుని ఏర్పా టైన పెద్ద అంబర్పేట్ పురపా లక సంఘం పరిధిలో అక్రమ కట్టడాలు వెలువెత్తుతున్నాయని ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉండడం గమనార్హం. అక్రమ కట్టడాలను నిరోధించి పులపాలక సంఘ ఖజానాను బలోపేతం చేయాల్సిన కౌన్సిలర్లు, ప్రజాప్రతి నిధులు తమ స్వంత ప్రయోజనాల కోసం అధికారులపై తీవ్ర ఒత్తిడిలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే కోవకి సంబం ధించి పురపాలక సంఘం ఆరవ వార్డు శ్రీ కృష్ణ మందిరం ఆవరణలో ఒక పెద్ద చర్చి నిర్మాణం జరుగు తోందని, ఆచర్చికి ఎలాంటి అనుమతులు లేవని మాకు ఈ విషయమై అనుమానంగా ఉందని స్థానిక భాజపా నాయకులు సోమవారం కమిషనర్ రవీందర్ రెడ్డి కి వినతి పత్రం అందించారు. ఈ విషయంలో సంబంధిత మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టి పొరపాటు జరిగి ఉంటే దానిపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.