Tuesday, October 15, 2024
spot_img

2024 గగన్‌యాన్‌కు ఇస్రో సంసిద్దత

తప్పక చదవండి
  • మానవరహిత విమాన పరీక్షలకు సిద్దం
  • ఇస్రో చైర్మన్‌ సోమ్‌ నాథ్‌ వెల్లడి

బెంగళూరు : 2024లో గగన్‌ యాన్‌ మిషన్‌కు అంతా సిద్ధం చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు. క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ మానవ రహిత విమాన పరీక్షలకు ఇస్రో సిద్ధమవుతోంది. మొదటి డెవలప్‌ మెంట్‌ ఫ్లైట్‌ టెస్ట్‌ వెహికల్‌ తయారీ చివరి దశలో ఉన్నందున గగన్‌ యాన్‌ మిషన్‌ కోసం మానవ రహిత విమాన పరీక్షలను త్వరలో ప్రారంభిస్తామని భారత అంతరిక్ష సంస్థ ఇప్పటికే ప్రకటించింది. గగన్‌ యాన్‌ ప్రాజెక్ట్‌ లో భాగంగా భూమికి 400 మీటర్ల ఎత్తులో ఉన్న వృత్తాకార కక్ష్యలోకి ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో కూడిన సిబ్బందిని ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఈ మిషన్‌ ఒకటి నుంచి మూడు రోజులు పడుతుం దని.. వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి రావడానికి కావాల్సిన సిస్టమ్‌ పై దృష్టి సారించామని ఇస్రో చైర్మన్‌ సోమ్‌ నాథ్‌ తెలిపారు. గగన్‌యాన్‌ మిషన్‌ కోసం ఇస్రో తన లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ టెక్‌ని అభివృద్ది చేస్తుందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌. సోమ్‌నాథ్‌ వెల్లడిరచారు. ఇతర దేశాలు తమ రీసెర్చ్‌ లను పంచుకునేందుకు ఇష్టపడవని చైర్మన్‌ తెలిపారు. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనేజేషన్‌ (ఇస్రో) 2023లో చంద్రయాన్‌3 తో సహా అనేక సక్సెస్‌ ఫుల్‌ అంతరిక్ష ప్రయోగాలతో యూనివర్సల్‌ హిస్టరీ మేకర్‌ అయిందని సోమ్‌ నాథ్‌ అన్నారు. ఇస్రో చేసిన అంతరిక్ష పరిశోధనలకు ప్రపంచం ప్రశంసలు కురిపించిందన్నారు. ఇస్రో మరో అంతరిక్ష ఫ్లైట్‌ మిషన్‌.. గగన్‌ యాన్‌.. దీనికోసం లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ టెక్నాలజీని పంచుకోవ డానికి ఇతర దేశాలు పంచుకోవడానికి సిద్దంగా లేవన్నారు. అయినప్పటికీ స్వదేశీ ఎన్విరాన్‌ మెంటల్‌ కంట్రోల్‌ లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ అభివృద్ధి చేస్తున్నందున ఇస్రో ఆశయానికి ఎలాంటి అడ్డంకులు లేవని సోమ్‌ నాథ్‌ ప్రకటించారు. ఈ మిషన్‌ తో భారత్‌ మరోసారి చరిత్ర సృష్టిస్తుందన్నారు. మనోహర్‌ పారికర్‌ విద్వాన్‌ మహోత్సవ్‌ 2023లో ఇస్రో చైర్మన్‌ మాట్లాడుతూ..పర్యావరణ నియంత్రణ, లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో మాకు అనుభవం లేదు. రాకెట్లు, ఉపగ్రహాలు మాత్రమే రూపొందిస్తున్నాం..అయితే ఈ సపోర్టు ను ఇతర దేశాలనుంచి ఆశించాం. ఏ ప్రభుత్వమూ క్లిష్టమైన పరిజ్ణానాన్ని అందించేందుకు సిద్ధంగా లేదు. దశాబ్దాల కాలంగా సహకారం, సాంకేతికత పురోగతి ద్వారా నాసా(అమెరికా), రోస్కోస్మోస్‌ (రష్యా), ఇఎస్‌ఎ యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ) వంటి అంతరిక్ష సంస్థలు ఇసిఎల్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థల అభివృద్ధికి సహకారాన్ని అందించాయి. అయినప్పటికీ సంబంధిత పరిశోధలను ఇస్రోతో పంచుకోవడంలో వారు విముఖత చూపారని.. దీంతో ఇసిఎల్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థను స్వదేశీ పరిజ్ణానంతో రూపొందించాలని ఇస్రో నిర్ణయించింద న్నారు. సాంకేతిక.. అంతరిక్షంలోని అనేక సవాళ్లతో కూడిన వాతావరణంలో వ్యోమగామి మనుగడకు అవసరమైన గాలి నాణ్యత, నీటి సరఫరాను నిర్వహిస్తుంది. యాక్టివేటెడ్‌ చార్‌ కోల్‌ బెడ్లు, ఉత్పేర్రక ఆక్సిడైజర్లు, మాలిక్యులర్‌ జ్లలెడలతో కూడిన ఖచ్చితమై మెకానిజమ్‌ల ద్వారా ఈ వ్యవస్థ క్యాబిన్‌ గాలి నాణ్యతను నియంత్రిస్తుంది. సిబ్బందికి శ్వాసక్రియ వాతావరణాన్ని నిర్దారిస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు