Saturday, April 27, 2024

సౌర గాలులపై ఆదిత్య స్టడీ

తప్పక చదవండి
  • ఫొటో రిలీజ్‌ చేసిన ఇస్రో

న్యూఢిల్లీ : సూర్యుడి అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 మిషన్‌ దూసుకెళ్తున్నది. అయితే ఆ శాటిలైట్‌లో ఉన్న ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ పేలోడ్‌ సౌర గాలుల స్టడీని ప్రారంభించింది. ఆ స్టడీకి చెందిన నివేదికను ఇస్రో రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం సోలార్‌ పేలోడ్‌ తన ఆపరేషన్స్‌ సక్రమంగా చేస్తున్నట్లు ఇస్రో వెల్లడిరచింది. విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌లో రెండు పరికరాలు ఉన్నాయి. దాంట్లో సోలార్‌ విండ్‌ ఐయాన్‌ స్పెక్ట్రోమీటర్‌, సూప్రా థర్మల్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ పార్టికల్‌ స్పెక్ట్రోమీటర్‌ ఉన్నాయి. సూప్రా థర్మల్‌ పరికరం సెప్టెబర్‌ 10వ తేదీ నుంచి యాక్షన్‌లో ఉంది. ఇక ఐయాన్‌ స్పెక్ట్రోమీటర్‌ శనివారమే తన పని ప్రారంభించింది. స్పెక్ట్రోమీటర్‌ పనితీరు బాగానే ఉందని ఇస్రో చెప్పింది. ఆదిత్య పేలోడ్‌ పరికరం తీసిన ఫోటోను ఇస్రో తన ఎక్స్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. ప్రోటాన్‌, ఆల్ఫా పార్టికల్స్‌లో ఉన్న ఎనర్జీ తేడాలను ఈ ఫోటోలో గమనించవచ్చు. రెండు రోజుల్లో ప్రోటాన్‌, ఆల్ఫా పార్టికల్‌ కౌంట్‌లో తేడా ఉన్నట్లు ఆదిత్య శాటిలైట్‌ గుర్తించినట్లు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు