Sunday, October 13, 2024
spot_img

ఇసుక అక్రమాలపై ఎపి హైకోర్టులో పిల్‌

తప్పక చదవండి

అమరావతి : రాష్ట్రంలో ఇసుక అక్రమాలు, కాంట్రాక్ట్‌ ముగిసిన తవ్వకాలపై హైకోర్ట్‌లో పిల్‌ దాఖలైంది. వేల కోట్లు రూపాయలు దుర్వినియోగంపై ఆధారాలుతో సహా పిటిషనర్‌ పిల్‌లో చేర్చారు. దండ నాగేంద్ర అనే వ్యక్తి తరపున హైకోర్ట్‌ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ పిటీషన్‌ వేశారు. ఈ యేడాది మే 2న కాంట్రాక్ట్‌ ముగిసినప్పటికీ కొనసాగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సబ్‌ కాంట్రాక్టర్‌ టర్న్‌ కీ సంస్థ పేరిట త్రవ్వకాలు చేశారంటూ బిల్లులతో సహా పిటీషన్‌లో చేర్చారు. అక్రమ తవ్వకాల వలన నదీ ప్రవాహ దిశ మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఇన్లాండ్‌ వాటర్‌ వేస్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నివేదికను కూడా న్యాయవాది లక్ష్మీనారాయణ పిల్‌లో పొందుపరిచ్చారు. ఎన్జీటీ తవ్వ కాలు ఆపివేయాలని కోరినా వినిపించుకోని ప్రభుత్వ తీరును న్యాయవాది వివరించారు. రాష్ట్రంలో నేటికీ జరుగుతున్న అక్రమ తవ్వకాలను వీడియో క్లిప్పింగ్‌లు, ఫోటోలతో సహా పిటీషన్‌లో మెన్షన్‌ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ తవ్వకాల వెనుక ప్రభుత్వ పెద్దలు హస్తం ఉందని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ పిల్‌పై హైకోర్టులో వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు