Monday, April 29, 2024

కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి..

తప్పక చదవండి
  • రాబోయే రోజుల్లో ‘కాంగ్రెస్’ నుంచి మరిన్ని డీప్ ఫేక్ వీడియోలు
  • కేటీఆర్ ఫోన్ కాల్ పేరిట ఆడియో రికార్డింగ్‌ను షేర్ చేసిన కాంగ్రెస్
  • ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాలంటూ నేతలను కేటీఆర్ కోరినట్టున్న ఆడియో వైరల్ తాజాగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసిన మంత్రి కేటీఆర్
  • ఈ ఉచ్చులో ఓటర్లు పడకుండా చూడాలని సూచన

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నుంచి మరిన్ని డీప్ ఫేక్ వీడియోలు రాబోతున్నాయని బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఓటర్లు ఈ ఉచ్చులో పడకుండా చూడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచన. ఈ మేరకు శ్రేణులను అప్రమత్తం చేస్తూ ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో స్కాంగ్రెస్ నుంచి అర్థరహిత ప్రొపగాండా పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. సమీపిస్తున్న సమయంలో డీప్‌ఫేక్‌లు చాలా రావొచ్చని.. ఓటర్లను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ వాళ్లు ఇలా చేస్తారని.. బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్ పార్టీ రానున్న 4-5 రోజుల్లో అనేక ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉందని చెప్పారు. ఓటర్లను ఇలాంటి వాటి విషయంలో చైతన్యం చేయాలని కేటీఆర్ సూచించారు. ఆయన ట్విట్టర్ వేదికగా అందర్నీ అప్రమత్తం చేశారు.

కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున సభలు, రోష్ షోలలో పాల్గొంటున్నారు. కేటీఆర్ గురువారం ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా మల్లాపూర్ లో మంత్రి కేటీఆర్ రోడ్డు షో నిర్వహించారు. ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లో కరెంట్ కూడా లేదని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే 24 గంటల పాటు కరెంట్ అందిస్తున్నామన్నారు.

- Advertisement -

పేదవారికి అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు కేటీఆర్. మూడోసారి అధికారంలోకి రాగానే మరో నాలుగు కొత్త కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఒకసారి చాన్స్ ఇవ్వమని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు గతంలో చాలాసార్లు అధికారం ఇచ్చారని, అయినా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. హైదరాబాద్ బాగుంటే మొత్తం తెలంగాణ బాగుంటుందని చెప్పారు. హైదరాబాద్ ను అన్ని రకాలుగా అభివృద్ధి పరిచి.. ఎలాంటి అల్లర్లు లేకుండా ఉంచడం ఒక కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. మెట్రోను ఉప్పల్ నలుమూలల కాప్రా, మల్లాపూర్ దాకా విస్తరించి అందుబాటులోకి తెస్తామన్నారు. పేదవాళ్లకు అన్నపూర్ణ, సౌభాగ్య లక్ష్మి, సన్నబియ్యం ఇచ్చే పథకాలు అమలు చేస్తామన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు