రాజకీయాల్లో పేద రైతుల పేర్లు వాడుకొని కోట్లు కోట్లు
దోచేస్తున్నారు.. మీ బతుకుకోసం రైతుల
జీవితాలను బ్యాంకులో తాకట్టు పెడుతున్నారు..
మా పేర్లు లేకపోతే మీ బ్రతుకులు ఎక్కడివి.. మా
సొమ్ము తినుకుంటూ, మమల్ని వాడుకుంటూ,
నన్ను మించిన మొనగాడు లేడని తొడలు
కొడుతున్నారు.. పేదోని పేరు చెప్పి
అడుకుతింటున్నారు.. పేదోని పేరుమీద సంస్థలు
పెట్టి దోచుకుతింటున్నారు.. ఆ సంస్థకి పెట్టుకున్నా
పేరే రాజకీయం.. ఒకపుడు రాజకీయం అంటే
ప్రజా క్షేత్రంలో జరిగేది.. ప్రజల మాట వినేది..
ఇప్పటి రాజకీయం దందాలు, మోసాలు, డబ్బులు
పంచుడు. హహకారపు మాటలు..
రాజకీయం అనే పదానికి ఇజ్జత్ లేకుండా
చేశారు.. రాష్ట్రం బాగుపడాలంటే నాయకులు
మారాలి..
` వికారాబాద్ శేఖర్