Wednesday, May 15, 2024

అనంత్ అశ్రిత్, వెంకటేష్ వుప్పల, తిరునగరి శరత్ చంద్ర కలయికలో – తెలుగు పార్టీ సాంగ్

తప్పక చదవండి

ఐ. టీ., ఏ. ఐ. వంటి ఒత్తిడి యుగంలో కూడా ప్రజలు ఆతమ ఒత్తిడిని అధిగమించి ఆనందించగలిగేలా పార్టీ పాటను రూపొందించారు వెంకటేష్ వుప్పల టీమ్. ఈ పాట పాశ్చాత్య ఈ.డీ.ఎం. జానర్ అయిన “ప్రోగ్రెసివ్ హౌస్” జానర్‌లో ఉంది. తెలుగు ఇండిపెండెంట్ మ్యూజిక్ కి రకరకాల కొత్త స్టైల్స్ తీసుకొస్తున్నారు. ట్రెండ్ సెట్టర్ గా పేరుగాంచిన వెంకటేష్ వుప్పల రూపొందించిన ఈ బీట్స్‌కి డ్యాన్సర్ కాని వారు కూడా ఎగిరి గంతేసేలా ఈ పాటను రూపొందించారు అని, ఒక్కసారి పాట వింటే చాలు వెంటనే ఆకట్టుకుంది
టీం సభ్యులు అన్నారు.

ఇండిపెండెంట్ మ్యుజిక్ మరియు సంగీతం లో నిష్ణాతులైన అనంత్ అశ్రిత్
ఈ పాటను పాడారు.
ఇదివరకు ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్ చేశారు. ఈ పాటతో ఇండిపెండెంట్ మ్యూజిక్ కు గ్రాండ్ డెబ్యు ఇస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో పాటలు ఉన్నాయి..త్వరలో వస్తున్నాయి.. పాట ఎంతో ఆహ్లాదకరంగా, థ్రిల్లిగ్గా, ఆకర్షణీయంగా ఉంటుంది అని యూనిట్ చెబుతోంది. “ఒత్తిడి సమయంలో ఓదార్పు, మనసును కొత్తలోకంలోకి తీసుకెళ్లడం, శ్రోతల మనసులో ఈ ట్యూన్ స్థిరపడిపోయి మైమరచిపోతారు” అని వారి పాటకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజెప్పే ప్రయత్నం చేశారు.

- Advertisement -

తిరునగరి శరత్ చంద్ర మంచి సాహిత్యాన్ని అందించారు. అత్యాధునికంగా, సరికొత్తగా హృదయాలను తాకే రీతిలో రాయడమే కాకుండా, భిన్నమైన పార్శ్వాన్ని ఖచ్చితంగా మేల్కొలిపే రీతిలో కొన్ని లిరికల్ పార్ట్స్ ఇందులో ఉన్నాయి అని తెలుస్తోంది. ర్యాప్ సాహిత్యాన్ని రాసింది కూడా ఇతనే .

ఇందులో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే పాట యొక్క ర్యాప్. ర్యాప్ లేకుండా పార్టీ పాట లేదు కదా! సంగీత దర్శకుడు, స్వరకర్త, ది విస్క్వేర్, వెంకటేష్ వుప్పల ఈ పాటలో ర్యాప్‌తో కొత్తదనం తెచ్చారు. పాట లో ర్యాప్ చాలా ఉల్లాసంగా ఉంటుంది. పాటకు ఈ ర్యాప్ అనేది కొసమెరుపులా కొత్తదనాన్నిస్తుంది.

మొత్తం ప్లానెట్ రెడ్ మ్యూజిక్ బృందం ఈ పాట యొక్క ప్రధాన లక్ష్యం అందరి చేత కిక్ ఇచ్చే డ్యాన్స్ చేయించడం, మరియు గతాన్ని మరచిపోయేలా చేయడం, తద్వారా వారు తమ ఒత్తిడి నుంచి బయటపడి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించవచ్చు. మన తెలుగు సంగీత పరిశ్రమలో చాలా కాలంగా ప్రజలు వెతుకుతున్న “ది పార్టీ సాంగ్” గా ఎప్పటికీ నిలిచిపోయే పాటగా దీన్ని రూపొందించారు. ఈ పాట వరల్డ్ వైడ్ గా అన్ని ఆడియో పొర్టల్స్ లోను, ప్లానెట్ రెడ్ మ్యూజిక్ ఛానల్ లో డిసెంబర్ 17 న రిలీజ్ అయ్యింది.

ఆ వన్ పార్టీ పాటగా “ఈ నైటే” పాటను మనకందించిన ప్లానెట్ రెడ్ మ్యూజిక్ – వెంకటేష్ వుప్పల, శరత్‌చంద్ర తిరునగరి, అనంత్ అశ్రిత్ టీం అందరికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు