Wednesday, May 8, 2024

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం

తప్పక చదవండి
  • 9 మంది సజీవ దహనం..
  • బజార్ ఘాట్ లోని ఓ గోడౌన్ లో ఎగిసిపడ్డ మంటలు
  • ఐదు అంతస్తులకు వ్యాపించడంతో లోపల చిక్కుకున్న కార్మికులు
  • నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది
  • ఘటనకు కెమికల్ డ్రమ్ములే కారణం
  • కీలక విషయాలు వెల్లడించిన ఫైర్ డీఐజీ

హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ గోడౌన్ లో సోమవారం మంటలు ఎగిసిపడ్డాయి. ఐదు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న వర్కర్లు మంటల్లో చిక్కుకున్నారు. ఏడుగురు వర్కర్లు సజీవదహనమయ్యారని సమాచారం.మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏడు ఫైరింజన్లతో మంటల్ని ఆర్పుతున్నారు. మెుత్తం 21 మంది మంటల్లో చిక్కుకోగా.. 9 మంది మృతి చెందారు. అందులో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన మరికొంత మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రమాదంలో గోడౌన్ ముందు పార్క్ చేసిన కొన్ని వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. కార్లు, బైకులు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తుండగా.. మృతి చెందిన కార్మికుల మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొనున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.

కీలక విషయాలు వెల్లడించిన ఫైర్ డీఐజీ
అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఫైర్ డీజీపీ నాగిరెడ్డి వెల్లడించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన కెమికల్ డబ్బాలే అగ్ని ప్రమాదానికి కారణంగా ఆయన వెల్లడించారు. భవన యజమాని రమేష్ జైష్వాల్‌గా గుర్తించామని చెప్పారు. ఐదు అంతస్తుల భవనంలో భారీగా కెమికల్ డబ్బాలు నిల్వచేసినట్లు తెలిపారు. రమేష్ జైష్వాల్‌కి ప్లాస్టిక్ తయారు చేసే ఇండస్ట్రీ ఉందని.. ఆ ఇండస్ట్రీలో ఉపయోగించే కెమికల్ డబ్బాలను జనావాసాల మధ్య నిల్వ చేసినట్లు చెప్పారు. మెుత్తం 150కి పైగా కెమికల్ డబ్బాలను ఆ బిల్డింగ్‌లో నిల్వ ఉంచినట్లు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కెమికల్ డబ్బాలో ఒకసారిగా అగ్నిప్రమాదం జరిగిందని.. ఆ తర్వాత బిల్డింగ్ మెుత్తం వేగంగా మంటలు వ్యాపించినట్లు చెప్పారు. భవనంలోని ఒకటి, రెండవ అంతస్థులో ఉన్న వాళ్లే మృత్యువాత పడ్డారని తెలిపారు. మూడు, నాలుగు అంతస్థుల్లో ఉన్నవాళ్లను క్షేమంగా రక్షించామన్నారు. మిగిలిన వారిని రక్షించామని… వారిలో 8 మంది అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు నాగిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం 10 మంది ఆసుపత్రిలో చికిత్స అందుతుండగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. భవనంలో డీజీల్, పెట్రోల్, ఆయిల్ వంటివి లేవన్నారు. కెమికల్ డబ్బాల కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు