Monday, May 20, 2024

సీఎం కేసీఆర్‌కు రూ.కోటి అప్పు ఇచ్చిన కాంగ్రెస్ నేత..

తప్పక చదవండి
  • ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోటిన్నర అప్పు ఇచ్చినట్టు వెల్లడి
  • సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారిన వివేక అఫిడవిట్

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకి రూ.1.06 కోట్లు అప్పు ఇచ్చానని చెన్నూరు బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నేత వివేక్ వెంకట స్వామి వెల్లడించారు. ఎన్నికల అఫిడవిట్‌లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ అఫిడవిట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అఫిడవిట్ తన మొత్తం ఆస్తి విలువ రూ.606.2 కోట్లుగా వివేక్ పేర్కొన్నారు. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థుల్లో ఈయనే రిచెస్ట్ క్యాండిడేట్‌. తనకు ఉన్న చరాస్తులు, స్థిరాస్తులు, అప్పుల వివరాలను కూడా అఫిడవిట్‌లో వివేక్ వెల్లడించారు. అఫిడవిట్‌లో సీఎం కేసీఆర్‌కు తాను అప్పు ఇచ్చినట్లుగా వివేక్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు తాను రూ. కోటి అప్పుఇచ్చినట్లుగా అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి మునుగోడు నుంచి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా వివేక్ అప్పు ఇచ్చారు.

ఆయనకు రూ.1.50 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 450 కోట్లకు పైగా ఆస్తులతో రెండో రిచెస్ట్ క్యాండిడేట్‌గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వివేక్ అప్పు ఇవ్వటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రాజకీయంగా ఎంత ప్రత్యర్థులైనా.. ఒకర్నొకరు దూషించుకున్నా.. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఒకరికొకరు సహాయం చేసుకోవటం ఆసక్తి రేపుతోంది. తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహారిస్తున్న కేసీఆర్.. వివేక్ వద్ద అప్పు చేయంటమేంటనే ప్రశ్న కూడా తలెత్తోతంది. రూ. కోటి ఆయన వద్ద అప్పు తీసుకోవటం ఆసక్తిని కలిగిస్తోంది. ఏది ఏమైనా.. వివేక్ వద్ద కేసీఆర్ అప్పు చేయటం హాట్ టాఫిక్‌గా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు