Tuesday, May 14, 2024

దేశవ్యాప్తంగా ఏడబ్ల్యూడబ్ల్యూఏ ద్వారా 32 ఆశా స్కూల్‌లు

తప్పక చదవండి
  • పిల్లల సంక్షేమం, స్కూల్‌ల ఆధునీకరణ కోసం రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ అవగాహన ఒప్పందం

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ , పుణె, బెంగళూరు, లక్నో, సికింద్రాబాద్‌, ఉధంపుర్‌ల లోని ఆశా స్కూల్‌లు ఆధునీకరణ, సమగ్ర అభివృద్ధి ద్వారా ప్రత్యేక సామర్థ్యం గల పిల్లల సంక్షేమం పట్ల రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, ఏడబ్ల్యూడబ్ల్యూఏ తమ దీర్ఘకాల నిబద్ధతను ప్రకటించాయి. ప్రత్యేక సామర్థ్యం గల పిల్లల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం దేశవ్యాప్తంగా ఏడబ్ల్యూడబ్ల్యూఏ ద్వారా 32 ఆశా స్కూల్‌లు నిర్వహించబడుతున్నాయి. ఆశా స్కూల్‌లు భారతదేశంలోని వివిధ నగరాల్లో సుమారు 1200 మంది పిల్లలను పోషిస్తున్నాయి, ఇందులో సైనిక సిబ్బంది, సైనిక దళాల మాజీ సిబ్బంది పిల్లలు 500 మంది, పౌర నేపథ్యం నుండి 500 మంది పిల్లలు ఉన్నారు. డిసెంబర్‌ 2022 – ఏప్రిల్‌ 2023 మధ్యకాలంలో ఆర్‌ఈఎల్‌ మరియు ఏడబ్ల్యూడబ్ల్యూఏ మధ్య సహకారం ప్రారంభించబడిరది. న్యూదిల్లీ, పుణె, బెంగళూరు, లక్నో, సికింద్రాబాద్‌, ఉధంపుర్‌లలో ఆర్‌ఈఎల్‌ ద్వారా ఆశా స్కూల్‌ ల ఉన్నతి, ఆధునీకరణ కోసం అవగాహన ఒప్పందం కుదిరింది. దిల్లీలోని ఆశా స్కూల్‌కి ఒక రూపాన్ని అందించడం కోసం ఆర్‌ఈఎల్‌ ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో ముఖ్యమైన మౌలిక సదుపాయాల పెంపుదల చేపట్టింది. ఇతర నగరాల్లోని స్కూల్‌లను కూడా అప్‌గ్రేడ్‌ చేయడంలో గణనీయమైన పురోగతి సాధించబడిరది. ఢల్లీిలోని ఆశా స్కూల్‌ ఆధునీకరణకు సాక్ష్యంగా ఉన్న సహకారం మొదటి దశ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. దిల్లీలో అమలు చేయబడిన మాడ్యూల్‌-ఆధారిత విధానాన్ని ప్రతిబింబిస్తూ, పాఠ్యాంశాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఇతర స్కూల్‌ల్లోని అధ్యాపకుల సామర్థ్యాలతో సహా వివిధ జోక్యాల ద్వారా ఆర్‌ఈఎల్‌ సంపూర్ణ మద్దతును అందిస్తుంది. రవాణా సౌకర్యాలు, వృత్తిపరమైన మార్గదర్శకత్వం, ప్లేస్‌మెంట్‌, ఇంటర్న్‌షిప్‌ సహాయం అందించడంతో పాటు విద్యార్థుల వైద్య, పోషకాహార అవసరాలతో ఈ స్కూల్‌లకు మద్దతు ఇవ్వాలని కూడా రెలిగేర్‌ భావిస్తోంది. విద్యార్థులను ఆర్థికంగా స్వతంత్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, రెలిగేర్‌ ఇంటర్న్‌షిప్‌, శిక్షణ అవకాశాలను నిర్వహించడం ద్వారా వారిని క్రమానుగతంగా వ్యాపార సంస్థలకు పరిచయం చేయడానికి ప్లాన్‌ చేస్తుంది. వారి శిక్షణ తర్వాత, రెలిగేర్‌ భారతదేశంలోని 100 స్థానాల్లో విస్తరించి ఉన్న రెలిగేర్‌ గ్రూప్‌ కంపెనీలలో ఉపాధిని కూడా అందిస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు