Wednesday, April 17, 2024

నాయకులకు ఉండాల్సిన ఉత్తమ గుణాలు..

తప్పక చదవండి

పురాణాల్లో రాజుల గురించి విన్నాం చదివాం. ఆనాడు రాజులు ఆదర్శంగా ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు. ప్రజలను కన్నబిడ్డలా చూసుకున్నారు. తమ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి రాజప్రసాధం లో మారువేశాలతో సాధారణ వ్యక్తుల జనావాసాలు సంచరించారని చదువుకున్నాం. కాలం మారింది రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. రాజరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. రాజులనాటి కాలంలో రాజులు చెప్పిందే వేదం అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన వారిని సమర్ధులను ఎన్నుకుంటారు. అందుకే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలే పరిపాలకులుగా ఎన్నికయ్యే మహత్తరమైనది మన ప్రజాస్వామ్య వ్యవస్థ. కానీ ప్రజల కోసం సేవ చేసే నిజమైన నాయకుడు కొనసాగే ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో ప్రలోభాలు డబ్బు, మద్యం వంటి వాటి ప్రభావంతో పాటు నేరచరిత్రలో అక్రమార్కుల సైతం అక్కడక్కడ చొరబడితే వ్యవస్థ స్ఫూర్తి క్రమంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదం నివారించాలంటే ఓటర్లు సాధించవచ్చు. నాయకులు వ్యవస్థ నడిపించే సత్తా కలిగిన వారై ఉండాలి .వారి మనసుతో పాటు నడక, నడత ఆలోచనలు చేసే పనులన్నీ నిస్వార్ధంగా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించేలా స్ఫూర్తి మంతపై మొత్తానికి ఆదర్శంగా ఉండాలి. ముఖ్యంగా చట్టసభల ఎన్నికల్లో నిలబడే నాయకుల లక్షణాల్లో ఓటర్లు గమనించాల్సినవి ఏమిటి అంటే నాయకుడికి తన నియోజకవర్గ ప్రజల పట్ల తల్లి లాంటి మనసు ఉండాలి. ఉదాహరణకు కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకొని శత్రువుల భారీ నుండి కాపాడుతుంది. పిల్లల భద్రత విషయంలో శత్రువు ఎంత పెద్దదైన ఆత్మవిశ్వాసాన్ని మదిలో నింపుకొని ఎదురు దాడి చేస్తుంది. నాయకుడు కూడా తన పరిధిలోని ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానని భరోసా ఇచ్చే విధంగా కడుపులో పెట్టుకొని చూసుకోవాలి.ప్రజలందరినీ సమదృష్టితో చూడగలగాలి. రానున్న కాలానికి ప్రజల అవసరాలు ఎలా ఉంటాయి. అందుకు అనుగుణంగా ఏమి చేయగలమో చూడగలిగే దార్శనిక దృష్టి అవసరము. అర్హులైన అత్యంత పేదరికంలో ఉన్న వారిని గుర్తించగలగాలి. ప్రభుత్వము అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో గమనించాలి. ప్రజల సమస్యలను వారి దృష్టి కోణంలో చూసి చట్టసభల్లో వాటికి పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేయాలి. మొత్తానికి తన నియోజకవర్గ ప్రజలపై రాజకీయాలకు అతీతంగా చల్లని చూపు కలిగి ఉండాలి. మంచి మాటలు చేటు కలిగించే చెడు మాటలను వేరు చేసి వినగలిగాలి. విమర్శలకు కృంగిపోకుండా పొగడ్తలకు పొంగిపోకుండా రెండిటిని సమంగా విని సమతుల్యత పాటించాలి. రామాయణంలో సీతమ్మ గురించి పామరుడైన ఒక పౌరుడు చేసిన విమర్శ వ్యాఖ్యను విన్న శ్రీరాముడు అవి పట్టించుకోవద్దని ఎందరు వారించిన వినకుండా ప్రజల మనోభావాలకు పాలకులు జవాబుదారులుగా ఉండాలని ప్రవేశం చేయించారని చెబుతారు. ముఖ్యంగా ప్రతిపక్షం చేసే విమర్శలను ఓపికగా విని వాటిలో నిజ నిజాలు గుర్తిరిగి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే బాగుంటుంది. హృదయానికి ప్రజల బాగోగులపై స్పందించే గుణం ఉండాలి. అలాంటప్పుడే ప్రజల హృదయాల్లో కొంత కాలం మంచి స్థానం పొందుతారు. సమస్యలు బాధలతో తన వద్దకు తెచ్చే వినతులను దయార్ధ హృదయంతో స్వీకరించాలి. చేసే పనులు ఆచరణలో దయా గుణం ప్రతిబింబించాలి. రాజకీయం అంటే వృత్తి కాదు అని గుర్తించాలి. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వారు నిర్ణీత పదవీకాలం పూర్తి చేశాక తన జీవన గమనానికి కుటుంబ పోషణకు ఏదో ఒక వృత్తి ఎంచుకొని ముందుకు సాగేలా ఉండాలి. ఎమ్మెల్యే అంటే పాలకుడు కాదు చట్టసభలకు పంపించిన ప్రజల ప్రతినిధి మాత్రమే .చట్టసభల్లో చట్టాల రూపకల్పన సమయంలో తనకు ప్రజాక్షేత్రంలో ఉన్న సంబంధాలు ఒకటి అవసరాలను చట్టాలకు ఎలా అన్వయించవచ్చు తెలియజేయగలగాలి. పెద్దపెద్ద స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు సైతం భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. ప్రజా సేవను అందించడంతో పాటు అవసరమైన చట్టాల రూపకల్పనలో భాగస్వామ్యం అనేది వారికి దక్కని తనకు మాత్రమే దొరికిన అవకాశం ఎంతో గొప్పదో అర్థం చేసుకోగలగాలి. చేతులకు అవినీతి అక్రమాల మకిలి అంటకుండా చూసుకోవాలి .తన పరిధిలోని ప్రజలకు ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి అభయహస్తం అందించేలా ఉండాలి. ముందు తరాలకు ప్రజాస్వామ్య ఫలాలు అందించేలా ప్రణాళికలు రాయగలగాలి.గతం లో అనేకమార్లు వివిధ శాసన సభ ఎన్నికల్లో అనేక సార్లు గెలుపొంది ప్రజాదరణ పొందిన శాసన సభ్యులు వున్నారు.అవినీతి, అక్రమాలకి పాల్పడకుండా సాధారణ జీవితం గడిపి ఆర్టీసి బస్సులు,ఆటోలలో అసెంబ్లీ కి పోయిన శాసన సభ్యులు వున్నారు.శాసన సభ్యులు ప్రజలకు సేవకులు గా వుండాలి.అధికార గర్వం, అహంకారం వుండకూడదు.ఇన్ని లక్షనాలు పోటీ చేసే నాయకుడులో వుండాలి.
` కామిడి సతీష్‌ రెడ్డి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు