Tuesday, May 21, 2024

భారతదేశంలోని ప్రముఖ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ కంపెనీ జంపిన్‌ హైట్స్‌

తప్పక చదవండి

న్యూఢిల్లీ : భారతదేశ అగ్రశ్రేణి ఎక్స్‌ ట్రీమ్‌ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ కంపెనీ జంపిన్‌ హైట్స్‌, 2010లో స్థాపించబడినప్పటి నుండి ఉద్వేగభరిత అనుభవాలలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. మాజీ కెప్టెన్‌ రాహుల్‌ నిగమ్‌ స్థాపించిన జంపిన్‌ హైట్స్‌, భద్రతకు ప్రాధాన్యమివ్వడం, మచ్చ లేని నాణ్యతను అందిం చడం ద్వారా భారత్‌ లో సాహస క్రీడలను పునర్నిర్వచించడమే లక్ష్యంగా పెట్టుకుంది. రిషికేశ్‌ లోని ఉత్కంఠ భరితమైన ప్రకృతి దృశ్యాల మధ్య జంపిన్‌ హైట్స్‌ భారతదేశపు మొట్టమొదటి, ఎత్తైన బంగీ జంపింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ను కలిగి ఉంది, ఇది 83 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశం ఎంపిక ఒక నిర్దిష్ట ఉద్దేశంతో జరిగింది. ఈ విషయం లో కెప్టెన్‌ నిగమ్‌ ఆశయం స్పష్టంగా ఉంది: కేవలం వినోదం, తీవ్రమైన సాహసం మధ్య తేడాను గుర్తించడం. అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్ధారించడానికి, జంపిన్‌ హైట్స్‌ ఈ సాహస క్రీడకు జన్మస్థలమైన న్యూజి లాండ్‌కు చెందిన నిపుణుల బృందాన్ని జంప్‌ జోన్‌ని రూపొందించడానికి వినియోగించింది.రిషికేశ్‌లో 1,50,000 కంటే ఎక్కువ జంప్‌ల తో భారతీయ అడ్వెంచర్‌ టూరిజంలో గొప్ప రికార్డును నెలకొల్పింది. తాజగా జంపిన్‌ హైట్స్‌ గోవా టూరిజంతో కలిసి గోవాకు తన పరిధులను విస్తరించింది, ఆగస్టు 28, 2019న తన రెండవ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ వెంచర్‌ గోవా అడ్వెంచర్‌ టూరిజం ల్యాండ్‌స్కేప్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది, థ్రిల్‌ కోరుకునే వారికి ఆనందించే అవకాశాన్ని అందిస్తుంది. ప్రసిద్ధ బాగా బీచ్‌ నుండి కేవలం 35 నిమిషాల ప్రయాణంలో అద్భుతమైన మాయెమ్‌ సరస్సు నేపథ్యంలో ఉద్వేగభరిత సాహసాలు. సంస్థ సిబ్బందికి ప్రథమ చికిత్సలో అర్హత ఉంది, రెడ్‌క్రాస్‌ ద్వారా ధ్రువీకరించబడిరది. సాహసం చేయాలనుకునే వారికి, ఈ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ కంపెనీ రిషికేశ్‌లో చక్కటి అనుభవాన్ని అందిస్తుంది: బంగి జంప్‌: 3700, జెయింట్‌ స్వింగ్‌: 3700, ఫ్లయింగ్‌ ఫాక్స్‌ (టాండమ్‌ లేదా ట్రిపుల్‌): 2000/వ్యక్తి ఫ్లయింగ్‌ ఫాక్స్‌ (ఒక్కరు): 3500, గోవాలో, టిక్కెట్‌లో భాగంగా వీడియో, దీని ధర 4110/- (Gూు).

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు