నా జాతి బానిస సంకెళ్లు..
నిట్టనిలువునా తెంచుకొన్నంత వరకు
నా దేశంలో అంబేద్కర్ కల్పించిన
ఓటనే బలమైన ఆయుధం..
అగ్వసగ్వలకు అమ్మబడుతూనే ఉంటది..
నా జాతి ఎంగిలి మెతుకులకు కుక్క తోక
పదవులకు ఆశపడి పాడిందే పాట
పాసుపండ్ల పాట అనే ముసధోరణికి
సలాం కొట్టకపోతే మన చరిత్ర అంతా
రాత్రికి రాత్రే అగ్గంటుకొని కాలిపోతది.
అందుకే ఇప్పుడైనా..
నా జాతి మారాలి..
నా దేశం మారాలి..
నా జాతి అంటే ఈ దేశ చరిత్ర ..
నా జాతంటే ఈ దేశ పునాది..
నా జాతంటే ఈ నేలపైన
ఓ చెదరని చెమట సంతకం
- కనకమామిడి సన్నీ