ప్రభుత్వాలు సంపద సృష్టించాలి,
ప్రజల జీవన ప్రమాణాలను
మెరుగుపరచాలి, ఉద్యోగ వనరులను
గుర్తించాలి గానీ.. ఆధునీకరణ సాకుతో
అందినకాడికి కమీషన్లు దండుకుంటున్నరు..
చారాణా కోడికి బారాణా మసాలా
అద్ది ప్రజా ఖజానాను లూటీజేస్తున్నారు.
అడిగేటోడు లేడని పాలకులే
శాషకులై కోట్లకు పడగలెత్తుతున్నారు.
ఓట్లేసిన పాపానికి ప్రజల నెత్తిన
అప్పుల భారం మోపి ఆగంబట్టిస్తున్నారు.
ఓ రికవరీ దేవుడా…
మా తప్పు మన్నించవయ్యా…
రేపటి తరానికి కనువిప్పు కలిగించవయ్యా..
అని దండకం చదువుకుంటున్నరు సామాన్య ప్రజలు.
- జగదీష్ నేత