Monday, April 29, 2024

బోనాల ఉత్సవాలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలి

తప్పక చదవండి

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

కంటోన్మెంట్‌ : తెలంగాణ ప్రజలు బోనాల ఉత్సవాలను సంతోషంగా ,గొప్పగాఆలో జరుపుకోవాలన్న చనతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్‌ దేవాలయాలకు కోడా ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారం వెస్ట్‌ మారేడ్‌ పల్లిలోని మల్టి పర్ఫస్‌ ఫంక్షన్‌ హాల్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంటోన్మెంట్‌ నియోజకవర్గ పరిధిలోని 211 దేవాలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం 56. 13 లక్షల రూపాయల విలువైన చెక్కులను బెవరేజేస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జెల నాగేష్‌,దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదితలతో కలిసి మంత్రి అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను సిఎం కేసీఆర్‌ రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తున్నట్లు వివరించారు. బోనాల ఉత్సవాల విశిష్టతను తెలంగాణా ప్రభుత్వం మరింత పెంచిందని చెప్పారు. మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు దేశ విదేశాలలో ఎంతో గొప్పగా జరుపుకుంటున్నారని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలను గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రామకృష్ణ, అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణ,నాయకులు టి ఎన్‌ శ్రీనివాస్‌,సుబ్రమణ్య స్వామి ఆలయ చైర్మన్‌ సంతోష్‌ యాదవ్‌,పనస సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు