Wednesday, May 15, 2024

హైకోర్టు ఆదేశాలనిలెక్కచేయని ఎస్‌ఐ

తప్పక చదవండి
  • మాజీ పోలీస్‌ అధికారిని కేసు నుండి తప్పించే ప్రయత్నం
  • చివ్వెంల ఎస్సై విష్ణు మూర్తి తీరుపై మరోసారి న్యాయపోరాటనికి సిద్ధం : భాదితులు
  • ఆరుగురుఉంటే, ఐదుగురిపైనే కేసులు ఎలా నమోదు చేస్తారని మండిపాటు
  • చివ్వెంల పోలీస్‌ స్టేషన్‌లో భాదితులకు న్యాయం దక్కడం లేదని ఆందోళన

సూర్యాపేట : హైకోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తూ,తన ఒంటెద్దు పోకడతో పోలీస్‌ స్టేషన్‌ కి వచ్చే బాధితులకు న్యాయం చేయకుండా,వారిపై చివ్వెంల ఎస్‌ఐ విష్ణుమూర్తి బెదిరింపులకు పాల్పడుతు న్నారని ఆరోపించారు పొనుగోటి సవిత వెంకట్‌. మంగళవారం చివ్వెంల మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ మేము ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వారి పేర్లలో ఓ మాజీ పోలీసు అధికారిని కేసు నుండి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు పొనుగోటి సవిత వెంకట్‌ ఆరోపించారు. బాధితులు పిర్యాదులు ఇస్తే కేసు నమోదు చేయకుండా, పిర్యాదు ఇచ్చిన భాదితులను ఎస్‌.ఐ ఇబ్బందులకు గురిచేస్తున్నరని తెలిపారు. కేసు నమోదు చేయాలని ఎస్సై విష్ణుమూర్తికి హైకోర్టు ఆదేశించినప్పట్టికి జిల్లా అధికారుల అండదండలతో ఎస్‌. ఐ ఏడుగురి పైన కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, అసలైన వ్యక్తి తీగల సుధాకర్‌ రావు ని కేసు నుండి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు భాదితులు ఆరోపించారు. తన భర్త తరుపున కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని, చివ్వెంల పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు చేయాలని కోరినప్పటికీ, ఎస్సై కేసు నమోదు చేయకుండా, పిర్యాదు దారులపైనే ఇష్టానుసారంగా కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై సంభదిత అధికారుల ఫిర్యాదు చేసిన కూడా చివ్వెంల ఎస్సై దగ్గర తేల్చుకోవాలని సూచించారని పేర్కొన్నారు. పోలీస్‌ లు బాధితులకు న్యాయం చేయడం లేదని హైకోర్టు ను ఆశ్రయిస్తే, ఎడుగురిపై కేసు నమోదు చేయాలని కోర్ట్‌ ఉత్తర్వులు జారీ చేసిందని, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎస్‌ఐ ఆరుగురు పైనే కేసు నమోదు చేశారని, ఇకనైనా మాజీ పోలీస్‌ అధికారి పై కేసు నమోదు చేయాలని,లేదంటే ఎస్సై పై న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. దీనిపై కోర్ట్‌ ధిక్కరణ కింద మరోసారి హైకోర్టు వెళతామని పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు