Tuesday, May 14, 2024

డబుల్‌ బెడ్‌ రూమ్‌లు స్థానికులకే ఇవ్వాలి

తప్పక చదవండి

4వ వార్డు సమస్యలపై మంత్రిని నిలదీసిన గ్రామ ప్రజలు

మేడ్చల్‌ : బీసీ కమ్యూనిటీ హాలును ఏర్పాటు చేయాలి అగ్రకులాల భవనాలకు అధిక నిధులు వెచ్చించి, దళిత భవనాలకు తక్కువ నిధులు ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డిని నిలదీసిన ఎమ్మార్పీఎస్‌ మేడ్చల్‌ మండల అధ్యక్షుడు పరుశురాం మాదిగ, మంగళవారం మేడ్చల్‌ మున్సిపాలిటీ లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి 4వ వార్డుకు విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి కి వార్డు ప్రజల నుండి నిరసన సెగ తగిలింది. వార్డులో పేరుకుపోయిన సమస్యలను తీర్చాలని మంత్రి మల్లారెడ్డి ని కోరారు. ఇటీవల ఎంపిక చేసిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ లబ్ధిదారుల ఎంపికలో స్థానికులకు కాకుండా ఇతరులకు కేటాయించడం ఏంటని మంత్రి మల్లారెడ్డిని ఎమ్మార్పీఎస్‌ నాయకులు ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ మేడ్చల్‌ మండల అధ్యక్షులు పరిశురాం మాదిగ మాట్లాడుతూ నాలుగో వార్డులో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ లను స్థానికులకే చెందేలా చూడాలని మంత్రికి విన్నవించారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా ఎస్సీ కమ్యూనిటీ భవనం శిథిలావస్థలో ఉన్న దానిని పట్టించుకునే వారు లేరని వెంటనే ఎస్సీ కమిటీ హాలు నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా వార్డులో బీసీ కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలని కోరారు, మంత్రి పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడటంతో పోలీసులు జోక్యం చేసుకొని నిరసనకారులను అక్కడి నుండి పంపించి వేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు బాల నరసింహ,నాగరాజు,భాస్కర్‌, రాజు, నవీన్‌,మహేష్‌, శివాజీ, వార్డ్‌ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు