Tuesday, May 21, 2024

కాంగ్రెస్ మూడో జాబితా విడుదల..

తప్పక చదవండి
  • 16 మందితో కాంగ్రెస్‌ మూడో లిస్ట్
  • కామారెడ్డి నుంచి బరిలో రేవంత్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మూడో జాబితా విడుదలైంది. 16మంది అభ్యర్థులతో లిస్ట్ ను ప్రకటించింది. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి బరిలో ఉండగా, సీఎం కేసీఆర్ పైనే పోటీకి దిగుతున్నారు. ఈ మూడో జాబితాలో 16 మంది అభ్యర్థులను ప్రకటించగా.. మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ స్థానాలను ఇంకా పెండింగ్ లో ఉంచారు. ఇప్పటికే 55 అభ్యర్థులతో తొలి జాబితాను, 45 మందితో రెండో జాబితాను ప్రకటించిన హస్తం పార్టీ 16 పేర్లతో మూడో లిస్టును కూడా ప్రకటించింది.

కాంగ్రెస్ గెలుపు గుర్రాలు..

- Advertisement -
  1. చెన్నూరు- వివేకానంద్(వివేక్)
  2. బోథ్- ఆదే గజేందర్ (వన్నెల అశోక్ స్థానంలో)
  3. జుక్కల్- లక్ష్మీకాంతారావు
  4. బాన్సువాడ- ఏనుగు రవీందర్ రెడ్డి
  5. కామారెడ్డి- రేవంత్ రెడ్డి
  6. నిజామాబాద్ అర్బన్- షబ్బీర్ అలీ
  7. కరీంనగర్- పురుముళ్ల శ్రీనివాస్
  8. సిరిసిల్ల- మహేందర్ రెడ్డి
  9. నారాయణ్ ఖేడ్- సురేశ్ షెట్కార్
  10. పటాన్ చెరు- నీలం మధు ముదిరాజ్
  11. వనపర్తి – తుడి మేఘా రెడ్డి(చిన్నారెడ్డి స్థానంలో)
  12. డోర్నకల్ – రామచంద్రు నాయక్
  13. ఇల్లందు- కోరం కనకయ్య
  14. వైరా – రాందాస్ మాలోత్
  15. సత్తుపల్లి- మట్ట రాగమయి
  16. అశ్వారావుపేట- ఆదినారాయణ.

బోథ్, వనపర్తి అభ్యర్థులు మార్పు..
16 మంది పేర్లతో మూడవ జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్. చెన్నూరు నుంచి మాజీ ఎంపీ జి. వివేక్ బరిలోకి దిగుతున్నారు. ఇదివరకు ప్రకటించిన బోథ్ స్థానంలో అభ్యర్థిని మార్చేసింది కాంగ్రెస్. బోథ్ అభ్యర్థిగా వన్నెల అశోక్ స్థానంలో ఆదే గజేందర్ పోటీ చేయబోతున్నారు. వనపర్తి అభ్యర్థిని సైతం మార్చింది కాంగ్రెస్. చిన్నారెడ్డి స్థానంలో తూడి మేఘ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మరోసారి కేకే మహేందర్ రెడ్డి పోటీ చేయనున్నారు. పటాన్‌చెరు నుంచి నీలం మధు ముదిరాజ్ పోటీ చేయనున్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇక, నిజామాబాద్ అర్బన్ కు షబ్బీర్ అలీని బదిలీ చేసింది కాంగ్రెస్. నారాయణఖేడ్ నుంచి సురేష్ షెట్కార్ బరిలోకి దిగనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు