Saturday, July 27, 2024

మ్యాన్ హోల్స్ మూతలకు రంగులు

తప్పక చదవండి

హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది.

  • లోతైన మ్యాన్ హోల్స్ కవర్లకు (రక్షణ మూత) ఎరుపు రంగు..
  • సేఫ్టీ గ్రిల్స్ ఉండే చోట వాటికి లేత నీలం రంగు వేయాలని నిర్ణయించింది..

రోడ్లపై వెళ్ళేవారు సులువుగా గుర్తు పట్టే విధంగా రంగులలో కవర్లు ఉంటే మంచిదనే ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. ఇప్పటికే రంగులు వేసే పనులు కూడా ప్రారంభించింది..
ఏది ఏమైనా మ్యాన్‌హోల్ కవర్లను తెరవవద్దని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
జీహెచ్‌ఎంసీ, పరిసర మున్సిపాలిటీల్లో 6.34 లక్షల మ్యాన్‌హోల్స్‌ ఉన్నాయి.. 63221 లోతైన మ్యాన్‌హోల్స్ ఉన్నాయి, వీటిలో 26798 GHMC పరిధిలో మరియు 36423 పరిసర మున్సిపాలిటీలలో ఉన్నాయి జీహెచ్‌ఎంసీలోని దాదాపు అన్ని లోతైన మ్యాన్‌హోల్స్‌లో సేఫ్టీ గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు.

- Advertisement -

మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉంటే లేదా విరిగిపోయినట్లయితే 155313కు కాల్ చేసి సమాచారం ఇవ్వొచ్చు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు