Sunday, June 23, 2024

హైదరాబాద్ లో ఈదురు గాలులో కూడిన వర్షం

తప్పక చదవండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్టు లో ఈదురు గాలులలో కూడీన వర్షం కురిసిoది. ఉప్పల్, అబిడ్స్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం.

ఘట్కేసర్ వరకు వర్షం ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.. పలుచోట్ల ఫ్లెక్సీ లు సైన్ బోర్డులు, ఎగిరిపడ్డాయి. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి..

- Advertisement -

హైదరాబాద్: వనస్థలిపురంలో

వనస్థలిపురంలో భారీగా వీచిన ఈదురుగాలులకు వృక్షాలు నేలకొరిగాయి.

వనస్థలిపురంలోని గణేష్ టెంపుల్ ప్రహరీ లోపల ఉన్న భారీ వృక్షం విరిగి రోడ్డు పై పడడంతో పార్కింగ్ చేసిన కారు, ఆటో ధ్వంసం అయ్యాయి. వనస్థలిపురం నుంచి ఎన్జీవోస్ కాలనీ వెళ్లే ప్రధాన రహదారిపై భారీ చెట్టు రహదారిపై విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనితో ఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్, డీఆర్ఎఫ్ టీం భారీ వృక్షాలను తొలగిస్తున్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు