Wednesday, October 9, 2024
spot_img

బొమ్మ మహేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

తప్పక చదవండి

పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ గౌడ్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఘనంగా జరిగాయి. మహేష్ గౌడ్ ను తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ శాలువా కప్పి , పుష్పగుచ్చము అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహేష్ గౌడ్ క్రమశిక్షణ గల నాయకుడని కొనియాడారు. విద్యార్ధి నాయకుడి నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు ఎదిగిన గొప్ప నాయకుడని , రానున్న రోజుల్లో మహేష్ గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి , పిసిసి కార్యాదర్శి ప్రవీణ్, సీనియర్ డాక్టర్ ఎం.ఎ అన్సారీ , కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, గౌడ్ కంఠమ్ జాతీయ మాస పత్రిక ఎడిటర్ నోముల సిద్దూ గౌడ్, తెలంగాణ గౌడ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి నేమూరి సాయి రామ్ గౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు