- వరల్డ్ కప్ లో ఇండియా పరాజయం..
వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాకు ఊహించిన పరాజయం ఎదురైంది. సొంత అభిమానుల సమక్షంలో ప్రపంచ కప్ ట్రోఫీని అందుకోవాలనుకున్న రోహిత్ సేన ఆశలకు ఆస్ట్రేలియా గండికొట్టింది. దాంతో, టీమిండియా సభ్యులతో పాటు కోట్లాదిమంది భారతీయులు గుండె పగిలింది. ఆసీస్ గెలవగానే మైదానంలోనే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్క కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని గమనించిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దగ్గరకు వచ్చి సిరాజ్‌ను ఓదార్చాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.