- కాలి బూడిద అయినా పడవలు
ఏపీ విశాఖపట్నం ఫిష్ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 40 పడవలు కాలిబూడిదయ్యాయి. ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి. ఆ తర్వాత సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని పేర్కొన్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అయితే, ప్రమాదంలో సుమారు రూ.30కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు అంచనా అంచనా వేస్తున్నారు. దాదాపు 40 వరకు బోట్లు కాలిపోవడంతో మత్స్యకారులు కన్నీరుమన్నీరవుతున్నారు. అయితే, సముద్ర గాలులకు మంటలు భారీగా చెలరేగడంతో ఒకదానికి ఒకటి అంటుకున్నాయి. పలువురు బోట్లను సముద్రంలోకి తీసుకెళ్లడంతో కొంత నష్టం తగ్గిందని పలువురు మత్స్యకారులు పేర్కొన్నారు.