Saturday, May 4, 2024

పదేళ్ళ పాలనల్లో అభివృద్ధి శూన్యం

తప్పక చదవండి
  • కేసీఆర్‌ను ఓడిరచడానికి కలసికట్టుగా రావాలి
  • ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల కల్పన
  • కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే భర్తీ చేస్తాం
  • ఉచిత కరెంట్‌పై కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్‌
  • నిరూపిస్తే నామినేషన్‌ ఉపసంహరించుకుంటా..
  • జనగామ మట్టికి పౌరుషం ఉంది
  • గడీల పాలనపై తిరగబడ్డ ఘనత దీనిది
  • శాసనసభ సమరంలో కాంగ్రెస్‌కు పట్టం కట్టాలి
  • కమీషన్లకు కక్కుర్తిపడి కేసీఆర్‌ భారీ అవినీతి
  • ప్రచార సభలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ పిలుపు

జనగామ : జనగామ మట్టికి పౌరుషం ఉందని, గడీల పాలనపై తిరగబడ్డ ఘనత దీనిదిని పిసిసి రేవంత్‌ రెడ్డి అన్నారు. కెసిఆర్‌ను ఓడించడానికి కలసికట్టుగా రావాలని జనగామ సభలో పిసిసి చీఫ్‌ రేవంత్‌ పిలుపునిచ్చారు.కేసీఆర్‌ పంచన మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన నేత పొన్నాలని అన్నారు. చివరు తిట్టిన కెసిఆర్‌ పంచన చేరడం ఆయనకేవిూ మర్యాదో చెప్పాలన్నారు. బుధవారం నాడు జనగామలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి విూడియాతో మాట్లాడతూ..ఈ జన సందోహాన్ని చూస్తుంటే కాలనాగుల పని పట్టడానికి పుట్టలోనుంచి చీమలు బయటకు వచ్చినట్లుంది. జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డిని ఓడిరచి బొంద పెట్టడానికి వచ్చిన విూకు అభినందనలు. పొన్నాల లేడని ఇక్కడ ఇబ్బంది జరుగుతదేమో అనుకున్నా…కానీ మిమ్మల్ని చూశాక నాకు ధైర్యం వచ్చింది. కన్నతల్లి లాంటి పార్టీని, కార్యకర్తలను మోసం చేసినవారికి బండకేసి కొడతామని నిరూపించారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గురించి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసి చెప్పిండు. వీళ్లిద్దరి బాగోతం గడీలో ఉన్న దొరకు తెలుసని రేవంత్‌రెడ్డి ఎద్దేవ చేశారు. ఈ ప్రాంతంలో మట్టికి ఒక పౌరుషం ఉంది. దొరల రాజ్యంపై పోరాటం చేసి ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర ఈ ప్రాంతానిది. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను మోసం చేసి పొన్నాల శత్రువు పంచన చేరాడు. అమెరికాలో మాట్లాడుకుని కేసీఆర్‌ పంచన చేరాడు. జనగామ ప్రజలు లక్ష కోట్లు దోచుకున్న దొంగ వైపు ఉంటారో ధర్మం వైపు ఉంటారో తేల్చుకోండి. ప్రజా ప్రభుత్వంలో పేదలను ఆదుకునేందుకు సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మాహిళలకు ప్రతీ నెల రూ.2500, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు, రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు, ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు ఆర్థికసాయం అందజేస్తాం. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్‌ లోకి కాంట్రాక్టర్లకు తప్ప ఎవరికీ ప్రవేశం లేదు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్‌ ఉంటే ఏంది లేకుంటే ఏంది? కేసీఆర్‌ ఉంటే విూకు వచ్చే పెన్షన్‌ రూ.2వేలు.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఓడగొడితే రూ.4వేలు వస్తాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే చేయూత పథకం ద్వారా నెలకు రూ.4వేలు పెన్షన్‌ అందిస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. జనగామ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే నిర్మల్‌ పట్టణ బృహత్‌ ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌)ను రద్దు చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారమే లక్ష్యంగా రాష్ట్రంలో పాగా వేసేందుకు హస్తం పార్టీ ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే నిర్మల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన రేవంత్‌.. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ.. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర శాసనసభ సమరంలో కాంగ్రెస్‌?కు పట్టం కట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రజలను కోరారు. నిర్మల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే జిల్లాలోని మాస్టర్‌ ప్లాన్‌ (పట్టణ బృహత్‌ ప్రణాళిక) రద్దు చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని రేవంత్‌ హామీ ఇచ్చారు. : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కమీషన్లకు కక్కుర్తిపడి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో సాగునీరు ఇచ్చేందుకు ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్‌ చేపట్టిందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే.. ఆదిలాబాద్‌కు సాగునీరు వచ్చేదని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే.. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయ్యేది కానీ తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు కడితే కమీషన్లు రావని కేసీఆర్‌ భావించారని దుయ్యబట్టారు. రీడిజైన్‌ పేరుతో ప్రాజెక్టు ఖర్చు రూ.లక్షన్నర కోట్లకు పెంచి భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో 25 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయన్న రేవంత్‌.. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు కట్టించి ఇస్తానని అందమైన కలలు చూపించారని బీఆర్‌ఎస్‌?పై విరుచుకుపడ్డారు. ఈ పదేళ్లలో ఎంతమందికి రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చారో కేసీఆర్‌ చెప్పాలని ప్రశ్నించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే కాంగ్రెస్‌ ఓట్లు అడుగుతుందని తెలుపుతూ.. రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే కేసీఆర్‌ ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. ఇవాళ తెలంగాణ మొత్తం ప్రమాదంలో పడిరది. ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదు. కొందరు దొరల చేతిలో ఆధిపత్యం నడుస్తోంది. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరు మీద తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన చేవెళ్ల ప్రాజెక్టును.. పేరు మార్చి కాళేశ్వరంగా మేడిగడ్డకు తరలించారు. రూ.38500 కోట్లతో కట్టాల్సిన ప్రాజెక్టును రూ.లక్షా యాభై వేల కోట్ల అంచనాకు పెంచి.. మొత్తం ధనాన్ని దోపీడీ చేశారు. మేడిగడ్డలో కట్టిన బ్యారేజ్‌ కుంగింది. అన్నారం పగిలిపోయిందని అన్నారు. సొంత జిల్లాలోనే ఇళ్లు నిర్మించని ఇంద్రకరణ్‌ రెడ్డి.. రాష్ట్రంలో ఇచ్చారంటే నమ్ముతారా అంటూ రేవంత్‌ రెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేసిన పార్టీ.. బీఆర్‌ఎస్‌ అని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదని రేవంత్‌ హామీ ఇచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపితేనే పేదలకు మళ్లీ మేలు జరుగుతుందని అన్నారు. దొరల పాలనకు, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతోందని రేవంత్‌ స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు