Thursday, July 25, 2024

అనుమతులు నిల్‌.. అక్రమాలు ఫుల్‌..

తప్పక చదవండి
  • అక్రమ నిర్మాణాలకు నిలువెత్తు నిదర్శనం ‘బాబాగూడ’
  • అధికారులకు అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే పొంతన లేని సమాధానాలు
  • కాసులు ఇస్తే ‘సై’ కనుచూపులు కరువు

పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన తరువాత అధికారుల జోరు కొనసాగుతుంది. గ్రామాలకు స్పెషల్‌ ఆఫీసర్లను నియమించిన కూడా వారు ఎప్పుడు వస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది దీనితో అధికారులు ఆడిరదే ఆటగా పాడిరదే పాటగా కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో జరుగుతున్న అక్రమాలను ప్రోత్సహిస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని అనుకుంటున్నారు ఏమో కాసుల కోసం వేట మొదలుపెట్టారు అని గ్రామంలో బహిరంగంగానే గుసగుసలు వినిపిస్తున్నాయి.వివరాల్లోకి వెళితే..శామీర్‌ పేట్‌ మండలంలోని బాబాగూడా గ్రామంలో ఇండ్ల మధ్యలో భారీ షెడ్‌ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం కొనసాగిస్తున్నారు. దీనిపై అక్రమార్కులు అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాన్ని చేస్తున్నారు అని గ్రామపంచాయతీ లో పలుమార్లు ఫిర్యాదులు చేసిన కూడా పట్టించుకునే వారే కరువయ్యారు. ఏమైనా అంటే నోటీసులు ఇచ్చాం చర్యలు తీసుకుంటాం అని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసాముబి అని చెబుతున్నారే తప్ప ఆక్రమ నిర్మాణం పై చర్యలు కాదు కదా కనీసం కనుచూపు కూడా లేదు. పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

అనుమతులు నిల్‌.. అక్రమాలు ఫుల్‌
ఏ గ్రామంలోనైనా అభివృద్ధి కోసం పోటీపడి తమ గ్రామాన్ని ఆదర్శవంతంగా గ్రామంగా తీర్చిదిద్దాలి అనుకుంటారు. కానీ బాబా గూడ గ్రామం అందుకు భిన్నంగా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ అక్రమాల్లో ‘తమకు తామే సాటి తమకు లేరు పోటీ ‘ అన్నట్టుగా కొనసాగుతుంది. గతంలో పలుసార్లు గ్రామసభల్లో , సర్వసభ సమావేశాల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు చలనం మాత్రం లేదు కేవలం నోటీసులకే పరిమితం అయిపోయారు అని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై పలు పత్రికల్లో ప్రచురించిన గాని అక్రమ నిర్మాణాలపై ఇంతవరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

కాసులు ఇస్తే ‘సై’ కనుచూపులు కరువు
గూడ గ్రామంలో నిర్మాణాలు నిర్మించాలి అంటే అనుమతులతో పనిలేదు అధికారుల చేతులు తడిపితే చాలు అక్రమ నిర్మాణాలపై వారి అండ దండలు ఉంటాయని గ్రామస్తులు అనుకుంటున్నారు.గ్రామంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు తమ విధి నిర్వహణను మరిచి కాసులకు కక్కుర్తి పడుతున్నారు. గ్రామంలో ఎవరైనా చిన్నపాటి నిర్మాణం చేపడితే చాలు అనుమతులు లేవంటూ నానా హంగామా చేసి కూల్చివేతలు చేపట్టే అధికారులకు బాబా గూడలోని ఇండ్ల మధ్యలో నిర్మిస్తున్న భారీ షెడ్‌ వారి కంటికి కనిపించడం లేదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.నిబంధనలు అతిక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు అని అధికారులు పాలు మార్లు చెప్పిన కేవలం మాటల వరకే నా అని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం తీసుకుంటాం : సాంబిరెడ్డి (డి ఎల్‌ పి ఓ)
డి ఎల్‌ పి ఓ ను అక్రమ నిర్మాణాలపై చేరవాణిలో వివరణ కోరగా. అక్రమ నిర్మాణం పై వచ్చిన ఫిర్యాదులు విధితమే అని అక్రమ నిర్మాణం పై విచారణ చేపట్టాము గ్రామపంచాయతీ కార్యదర్శికి అక్రమ నిర్మాణం పై పూర్తి వివరాలు సేకరించామని చెప్పాము అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకొని కూల్చివేత చేస్తామని చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు.ఫిర్యాదు చేసిన అక్రమ నిర్మాణం అని తెలిసినా కూడా అధికారులు కాలయాపన చేస్తున్నారు అంటే అధికారుల పనితీరు ఎలా ఉందో స్పష్టం అవుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు