Monday, April 29, 2024

వర్క్‌ ఫ్రం జైల్‌.. సీఎం కేజీవ్రాల్‌తో ఆప్‌ ఎమ్మెల్యేలు

తప్పక చదవండి

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజీవ్రాల్‌ సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. ఒక వేళ కేజీవ్రాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసినా, ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగాలని పార్టీ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో కోరినట్టు ఆప్‌ వెల్లడిరచింది. గతవారం కేజీవ్రాల్‌కు ఈడీ సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ ఆరోపణల్ని రాజకీయ ప్రేరేపితంగా పేర్కొంటూ సమన్లను ఆయన తిరస్కరించారు. నవంబర్‌ 2 నాటి ఈడీ విచారణకు హాజరుకాలేదు. మావేశ వివరాల్ని ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ విూడియా కు వెల్లడిరచారు. ‘కేజీవ్రాల్‌ను ఎన్నికల్లో ఓడిరచటం సాధ్యం కాదని గ్రహించిన బీజేపీ, కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నది. కేజీవ్రాల్‌ అరెస్టయితే.. ప్రభుత్వ అధికారులు జైలుకు వెళ్లి సీఎంతో సమావేశమవుతారు. పరిస్థితులు చూస్తుంటే మమ్మల్ని కూడా జైల్లో పెట్టొచ్చు. అప్పుడు మేమంతా జైల్లోనే క్యాబినెట్‌ సమావేశాలు నిర్వహిస్తాం. అప్పుడు కూడా ఢిల్లీ ప్రభుత్వ పనులు మాత్రం ఆగవు’ అని భరద్వాజ్‌ అన్నారు. ఎన్నికల ముంగిట ఈడీని అడ్డుపెట్టుకుని విపక్ష నేతలను కేంద్రం వేధిస్తున్నదని ఆప్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు